అంబటి రాయుడు చేజేతులా!: వరల్డ్‌కప్ జట్టులో దక్కని చోటు!

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడబోయే భారత జట్టుని సెలక్టర్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదిక జరగనున్న ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే టీమిండియాలో ఎంపికలో పెద్దగా మార్పులు కనిపించలేదు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
గతేడాది కాలంగా జట్టులో చోటు దక్కుతుందని భావించిన అంబటి రాయుడికి షాక్ తగిలడంతో పాటు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లకు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. అనుభవం దృష్ట్యా దినేశ్ కార్తీక్ వైపు సెలక్టర్లు మొగ్గుచూపారు. మరోవైపు అందరూ ఊహించినట్లే ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శన చేసిన విజయ్ శంకర్‌కు చోటు కల్పించారు.

జట్టులో చోటు దక్కుతుందని
కాగా, గతేడాది కాలంగా జట్టులో చోటు దక్కుతుందని భావించిన అంబటి రాయుడి ఎంపిక విషయంలో సెలక్టర్లు కొంచెం జాగ్రత్ర వహించినట్లే కనిపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత నుంచి నాలుగో నంబర్ స్థానంలో ఆడే ఆటగాడి కోసం సెలక్టర్లు అందుబాటులో ఉన్న అందరు ఆటగాళ్లకు రొటేషన్ పద్ధతిలో అవకాశాలిచ్చారు.

వన్డే జట్టులో చోటు
ఈ క్రమంలో గత ఐపీఎల్ సీజన్‌లో ఓపెనర్‌గా రాణించిన అంబటి రాయుడి ప్రదర్శనకు ముగ్ధులైన సెలక్టర్లు అతడికి వన్డే జట్టులో చోటు కల్పించారు. 2018లో మొత్తం 11 మ్యాచుల్లో 10 ఇన్నింగ్స్‌లాడిన అంబటి రాయుడు ఆసియాకప్‌లో హాంకాంగ్, ఆప్ఘనిస్థాన్‌పై హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఆసియా కప్ తర్వాత రాయుడు నాలుగో స్థానానికి చక్కగా సరిపోతాడంటూ కెప్టెన్ కోహ్లీ బహిరంగంగానే మద్దతు పలికాడు.

వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో సెంచరీ
ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో సెంచరీ కూడా సాధించాడు. ఆ సిరిస్‌లో 56 యావరేజితో 392 పరుగులు సాధించాడు. గతేడాది మొత్తం కోహ్లీసేన 24 వన్డేలాడగా అందులో రాయుడు 21 వన్డేల్లో ఆడాడు. ఇక, 2019 మాత్రం అంబటి రాయుడుకి ఎంత మాత్రం కలిసిరాలేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన వన్డే సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేశాడు.

ఆసీస్ సిరిస్‌లో విఫలం
తొలి వన్డేలో రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రెండో వన్డేలోనూ పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో మూడో వన్డేలో చోటు కోల్పోయాడు. దీంతో మూడో వన్డేలో చోటు కోల్పోయాడు. ఇక, న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో 90 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లోనూ విఫలమయ్యాడు.

ఐపీఎల్‌లోనూ నిరాశే!
దీంతో వరల్డ్‌కప్ జట్టులో అంబటి రాయుడు చోటు దక్కించుకోవడంపై విఫలమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లోనూ రాయుడు ఆశించిన మేర రాణించడం లేదు. ఇది కూడా అంబటి రాయుడు చోటు దక్కించుకోలేకపోవడానికి ఓ కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపిక జట్టులో విజయ్ శంకర్‌ను నాలుగో స్థానంలో ఆడించే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications