రాజ్‌కోట్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. 310 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆదివారం ఐదో రోజు బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 52.3 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసి చివరకు తృటిలో ఓటమి నుంచి బయటపడింది.
భారత్ Vs ఇంగ్లాండ్ తొలి టెస్టు స్కోరుకార్డు
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ (49 నాటౌట్), జడేజా (32 నాటౌట్) పది ఓవర్ల పాటు ఆచితూచి ఆడి వికెట్‌ను కాపాడుకోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
తొలి టెస్టులో ఫీల్డింగ్‌లో చాలా తప్పిదాలు జరిగాయని, తర్వాతి టెస్టులో ఆ తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడతామని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఐదు క్యాచ్‌లు మిస్ చేశామని, ఇంగ్లాండ్‌కు అవకాశం ఇవ్వబోమని తెలిపాడు. ఇంగ్లాండ్ బౌలర్లు మన బ్యాట్స్‌మెన్లపై తీవ్రమైన ఒత్తిడి పెంచిన మాట నిజమేనన్నాడు.
{image-virat-kohli-hit-wicket-rajkot-test2-14-1479098002-14-1479102931.jpg telugu.mykhel.com
మ్యాచ్ చివరి రోజు ఆటలో బంతి అనుకున్నదాని కంటే ఎక్కువ టర్న్ అవడమే కాకుండా, బాగా బౌన్స్ కూడా అయినట్లు కోహ్లి తెలిపాడు. ఈ నేపథ్యంలోనే భారత్ తన రెండో ఇన్నింగ్స్ ఆదిలో కీలక వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడిందని కోహ్లీ స్పష్టం చేశాడు.
తొలి టెస్టు నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నామని, ప్రధానంగా ఆటను ఎలా కాపాడుకోవాలో బాగా అర్ధమైనట్లు కోహ్లి పేర్కొన్నాడు. రాబోయే రోజుల్లో మరొకసారి ఇదే పరిస్థితి ఎదురైతే దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు.
ఇంతక ముందు టీమిండియాకు టెస్టు మ్యాచ్‌లు డ్రా చేయడం తెలియదని చాలా మంది సందేహించేవారని చెప్పిన కోహ్లీ ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లను డ్రా చేయడం ఎలాగో మాకు తెలుసుని కోహ్లీ వెల్లడించాడు. రాజ్‌కోట్ టెస్టులో 30వ సెంచరీ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ కుక్ సైతం స్పందించాడు.
తొలి టెస్టు డ్రా: ఇంగ్లాండ్ ఆధిపత్యం, కోహ్లీ అప్రమత్తత
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలి టెస్టులో ఆధిక్యాన్ని కనబర్చిందని అన్నాడు. భారత్‌లో 530 పరుగులు చేసిన ఏ జట్టు అయినా గెలుపు బరిలో నిలుస్తుందని అన్నాడు. భారత్ కూడా అద్భుతమైన క్రికెట్ ఆడిందని, అయితే త్వరగా పరుగులు సాధించడంలో వెనుకబడ్డామని కుక్ అన్నాడు.
మరోవైపు రాజ్ కోట్ టెస్టుతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ హసీబ్ హామీద్, స్పిన్నర్ అదిల్ రషీద్‌లపై ప్రశంసలు కురిపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్ 64 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకుని భారత్‌పై ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయించడంలో కీలక పాత్ర పోషించాడు.