Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's Asia Cup: ఫైనల్‍కు దూసుకెళ్లిన భారత్.. థాయ్‍లాండ్‍పై గెలుపు..

India won by 74 runs against Thailand

మహిళ ఆసియా కప్ లో భారత్ ఫైనల్ కు దూసుకెళ్లింది. థాయ్‍లాండ్‍పై 74 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఓపెనర్ సఫాలి వర్మ 28 బంతుల్లో ఒక సిక్స్, ఐదు ఫోర్లతో 42 పరుగులు చేసింది.

హర్మన్‌ప్రీత్ కౌర్
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ 27, పూజా వస్త్రాకర్ 17, స్మృతి మందన 13 పరుగులు చేసింది. థాయ్ లాండ్ బౌలర్లలో టిప్పోచ్ 3 వికెట్లు పడగొట్టగా..
బూచతం, ఫన్నిత మాయ, తిపట్చా పుట్టావోంగ్ తలో వికెట్ తీశారు. 149 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాంటింగ్ కు దిగిన థాయ్ లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లో కోల్పోయి 74 పరుగులు మాత్రమే చేసింది.

పాకిస్తానా.. శ్రీలంక
కెప్టెన్ నరుఎమోల్ చైవాయి 21 పరుగులు చేయగా.. నత్తయ బూచతం 21 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 ఓవర్లలో ఏడు పరుగులిచ్చి మూడు వికెట్లు తీసింది. రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టగా.. రేణుక సింగ్, రానా, షఫాలి వర్మ తలో వికెట్ తీశారు. భారత్ ఫైనల్ లో పాకిస్థాన్ లేదా శ్రీలంకతో తలపడే అవకాశం ఉంది.

Story first published: Thursday, October 13, 2022, 13:33 [IST]
Other articles published on Oct 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+