T20 World Cup 2022: నెదర్లాండ్స్ పై భారత్ గెలుపు.. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్..

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా సిడ్నీలో ఇండియా, నెదర్లాండ్స్ మధ్య జరిగిన సూపర్-12 మ్యాచ్ లో భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. మూడో ఓవర్ నాలుగో బంతికి కేఎల్ రాహుల్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, రోహిత్ కలిసి ఇన్నింగ్స్ ను పరుగెత్తించారు.

రోహిత్ శర్మ
కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు టచ్ లోకి వచ్చాడు. నెదర్లాండ్స్ బౌలర్లను ఒక ఆట ఆడించాడు. 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు హిట్ మ్యాన్. ఇందులో మూడు క్లాసిక్ సిక్స్‌లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ తో రోహిత్ మరో ఘనత సాధించాడు. వరల్డ్ కప్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన భారత ఆటగాళ్లలో మొదటి స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 34 సిక్స్ లతో ప్రథమ స్థానంలో ఉండగా.. యువరాజ్ సింగ్ 33 సిక్స్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. కింగ్ కోహ్లీ 24 సిక్స్ లతో మూడో స్థానంలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ
భీకర ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్లతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరీ చేయడమే కాకుండా టీ20 వరల్డ్ కప్ ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. క్రిస్ గేల్ (965) అధికమించిన కోహ్లీ (979) పగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 82 పరుగులతో అజేయంగా నిలిచి ఇండియాను గెలిపించాడు.

సూర్య కుమార్
మరో బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 25 బంతుల్లో ఒక సిక్స్, 7 ఫోర్లతో 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అందుకున్నాడు. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్, అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications