
టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా పెర్త్ లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సూపర్-12 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా తక్కువ స్కోరే చేసింది. ఈ మ్యాచ్ లో భారత టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే రాణించడంతో ఇండియా ఆ మాత్రం పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
కేఎల్ రాహుల్ మొదటి ఓవర్ లో ఒక్క పరుగు చేయకుండా మెయిడిన్ చేశారు. ఆ తర్వాత కొంచెం టచ్ లోకి వచ్చినట్లు అనిపించిన రోహిత్ శర్మ సిక్స్ కొట్టాడు. ఈ క్రమంలో 15 పరుగులు చేసి ఎంగిడి బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల 9 పరుగుల వద్ద స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కోహ్లీ ఉన్నంత సేపు చాలా కాన్ఫిడెంట్ గా ఆడాడు. కాని షాట్ పిచ్ బంతిని బౌండరీ తరలించే క్రమంలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
వరల్డ్ కప్ లో తొలిసారి తుది జట్టు స్థానం దక్కించుకున్ దీపక్ హుడా డకౌట్ అయ్యాడు. మరోవైపు సూర్య కుమార్ మాత్రం ఏ మాత్రం బెరుకు లేకుండా స్వేచ్ఛగా ఆడాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వేగంగా ఆడే క్రమంలో 40 బంతుల్లో 3 సిక్స్ లు, 6 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. కాగా సూర్య కుమార్ హాఫ్ సెంచరీ చేసిన 10 సందర్భాల్లో ఇండియా గెలిచింది. గత మ్యాచ్ లో సూర్య కుమార్ హాఫ్ సెంచరీ చేయగా.. ఆ మ్యాచ్ లో కూడా భారత్ గెలిచింది.
కాగా ఈ మ్యాచ్ కు హాట్ స్టార్ లో భారీగా వ్యూవర్ షిప్ వస్తుంది. ఈ మ్యాచ్ ను కోటీపైగా మంది హాట్ స్టార్ లో వీక్షిస్తున్నారు. భారత్ మ్యాచ్ లతో హాట్ స్టార్ భారీగా వ్యూవర్ షిప్ వస్తుంది. ఆసియా కప్ లోనూ భారత్ , పాక్ తొలి మ్యాచ్ కోటీ 30 లక్షల మంది చూశారు. మొన్న జరిగిన జింబాబ్వే, పాకిస్థాన్ మ్యాచ్ ఆరు మిలియన్ల మంది చూశారు.