Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. టీమిండియాలో కొత్త ప్లేయర్ ఎంట్రీ

దక్షిణాఫ్రికాతో భారత మహిళా జట్టు మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో రెండో వన్డే‌లో తలపడనుంది. ఇప్పటికే తొలి వన్డే‌లో ఘన విజయం సాధించిన ఇండియా ఉమెన్స్ జట్టు ఈ పోరులోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలో బరిలోకి దిగుతోంది.

మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి మూడు వన్డేల సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని సౌతాఫ్రికా ఉమెన్స్ టీమ్ భావిస్తోంది. స్మృతి మంధానతో త్వరగా పెవిలియన్‌కు చేర్చి ఆతిథ్య జట్టుపై పైచేయి సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. తొలి వన్డేలో స్మృతి సెంచరీతో చెలరేగడంతో భారత్ 143 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

India Women vs South Africa Women Debutant ArundhatI Reddy replaces Renuka Thakur Singh

అయితే స్మృతి అనంతరం భారత జట్టులో రెండో అత్యధిక స్కోరు దీప్తి శర్మ సాధించిన 37 పరుగులే. దీంతో స్టార్ బ్యాటర్‌ను ఆదిలోనే ఔట్ చేస్తే టీమిండియాపై ఒత్తిడి తీసుకురావచ్చని దక్షిణాఫ్రికా భావిస్తోంది. కాగా, టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున వన్డేల్లో అరుంధతి రెడ్డి అరంగేట్రం చేస్తోంది. స్మృతి మంధాన నుంచి అరుంధతి టీమిండియా క్యాప్‌ను అందుకుంది. రేణుక స్థానంలో అరుంధతి తుదిజట్టులోకి వచ్చింది.

తుదిజట్టు వివరాలు
భారత్: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రాధ యాదవ్, అశా శోభన

దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ (కెప్టెన్), తజ్మిన్, అన్నెకే, సునే లూస్, మరిజన్నే, నాడిన్ డిక్లెర్క్, షాంగసె, మెయికే డిరిడ్డర్, మసాబట క్లాస్, మ్లాబా, అయబొంగ.

Story first published: Wednesday, June 19, 2024, 13:22 [IST]
Other articles published on Jun 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+