IND vs SA: ఒక్క బంతి కూడా పడకుండానే.. భారత్, దక్షిణాఫ్రికా రెండో టీ20 వర్షార్పణం

సూరత్: భారత్, దక్షిణాఫ్రికా మహిళల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ వర్షార్పణం అయింది. కుండపోత వాన వల్ల కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. భారీ వర్షం కారణంగా టాస్ కూడా సాధ్యపడలేదు. దీంతో దక్షిణాఫ్రికా మహిళలపై తొలి టీ20 మ్యాచ్ నెగ్గి మంచి ఊపు మీదున్న హర్మన్‌ప్రీత్ సేనకు షాక్ తగిలింది. మరోవైపు విజయనగరంలో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు.

టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు:
గురువారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో మహిళల మ్యాచ్ ప్రారంభ సమయానికి ఔట్ ఫీల్డ్ అంతా చిత్తడి మారింది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలు కావాల్సి ఉండగా.. 8 గంటలకు అంపైర్లు మైదానాన్ని మరోసారి పరిశీలించారు. ఔట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా ఉండంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాదని తెలపడంతో.. టాస్ వేయకుండానే మ్యాచ్ వర్షార్పణం అయింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత అమ్మాయిలు 11 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యతలో నిలిచిన సంగతి తెలిసిందే. మూడో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.

ప్రాక్టీస్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు:
మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ కోసం ఏర్పాటు చేసిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సన్నాహక మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. మూడు రోజుల ఈ వామప్ మ్యాచ్ గురువారం ప్రారంభం కావాల్సి ఉండగా.. భారీ వర్షం కారణంగా మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో తొలి రోజు ఆట సాధ్యపడలేదు. చాలా సమయం వేచిచూసినా ఆటకు వీలుకాలేదు. వరణుడు కనీసం టాస్ వేసే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో ఇరు జట్లు డ్రెస్సింగ్‌రూమ్‌లకే పరిమితమయ్యాయి.

భారీ వర్ష సూచనలు:
మ్యాచ్ రద్దు కావడంతో అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ల ఆటను దగ్గరగా చూసేందుకు వచ్చిన విశాఖ అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. బోర్డు ప్రెసిడెంట్స్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రెండో రోజు (శుక్రవారం) కూడా భారీ వర్షం కురిసే సూచనలు ఉండటంతో మ్యాచ్ సాగే పరిస్థితులు కనిపించడం లేదు. వర్షం మళ్లీ పడితే ఈ రోజు కూడా ఆటగాళ్లు స్సింగ్‌రూమ్‌లకే పరిమితం కానున్నారు. వాతావరణ ప్రభావంతో ప్రస్తుతం మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. విజయనగరం సమీపంలోని డా. పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications