Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాస్ గెలిచిన టీమిండియా.. ముగ్గురు భారత ప్లేయర్లు అరంగేట్రం

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన భారత మహిళా జట్టు టెస్టు ఫార్మాట్‌కు సిద్ధమైంది. డీవై పటేల్ వేదికగా ఇవాళ నుంచి ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టు ఆడనుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్ లో ముగ్గురు భారత ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నారు. రేణుక ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, శుభ సతీష్ తమ కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడనున్నారు. అయితే తొలి గంట ఆటలో భారత బ్యాటర్లకు సవాలు ఉండనుంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. పిచ్ స్పిన్నర్లకు కూడా సహకరిస్తుంది.

India Women vs England Women: Team India won the toss.. Three Indian players made their debut

కాగా, స్వదేశంలో భారత మహిళా జట్టు 2014 తర్వాత ఈ రోజే తొలి టెస్టు ఆడుతోంది. మరోవైపు భారత్‌లో ఇంగ్లాండ్ 2005 తర్వాతే ఇవాళే టెస్టు మ్యాచ్ ఆడుతోంది. అంతేగాక మిథాలీరాజ్, జులన్ గోస్వామి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాతే భారత్ ఆడుతున్న టెస్టు ఇదే. మరోవైపు ఇంగ్లాండ్‌ మహిళలకు ఇది 100వ టెస్టు మ్యాచ్‌

ఇప్పటివరకు భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య 14 టెస్టులు జరిగాయి. రెండు టెస్టుల్లో గెలిచిన భారత మహిళా జట్టు.. ఒక మ్యాచ్ లో ఓటమిపాలైంది. మిగిలిన 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

టీమిండియా: స్మృతి మంధాన, , షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), శుభ సతీష్, యాస్తిక. దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్‌, స్నేహ్ రాణా,రాజేశ్వరి గైక్వాడ్, రేణుక ఠాకూర్

ఇంగ్లాండ్: టామి, సోఫియా, హీథర్ (కెప్టెన్), స్కివర్, డేనియల్ వ్యాట్, అమి జోన్స్, సోఫీ, చార్లీ, కేట్ క్రాస్ లారెన్ ఫైలర్, లారెన్ బెల్

Story first published: Thursday, December 14, 2023, 10:04 [IST]
Other articles published on Dec 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+