Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: భారత్ కొంపముంచిన అంపైర్ నిర్ణయం!

సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. మహిళల టీ20 ప్రపంచకప్ -2024లో భాగంగా షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 151 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (40; 41 బంతుల్లో, 5 ఫోర్లు) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో రేణుక సింగ్, దీప్తి శర్మ రెండు వికెట్లు, శ్రేయాంక, పూజ వస్త్రాకర్, రాధ యాదవ్ తలో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (54 నాటౌట్; 47 బంతుల్లో, 6 ఫోర్లు) పోరాడింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (20; 13 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయింది. దీప్తి శర్మ (29; 25 బంతుల్లో, 3 ఫోర్లు) పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్, సోఫీ మోలనూ తలో రెండు వికెట్లు తీశారు.

India Women vs Australia Women Why Phoebe Litchfield s LBW Appeal Was Denied

అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయం వివాదస్పదంగా మారింది. ఇది భారత్‌కు ప్రతికూల ప్రభావం చూపించింది. ఫలితంగా మ్యాచ్ ఓటమికి ఓ కారణంగా నిలిచింది. అసలేం జరిగిదంటే.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ వేసిన 17వ ఓవర్‌‌ రెండో బంతికి లిచ్‌ఫీల్డ్ ఎల్బీడబ్లూగా అంపైర్ ప్రకటించారు. ఎడమచేతి వాటం బ్యాటర్ లిచ్‌ఫీల్డ్ స్విచ్ షాట్‌కు యత్నించి బ్యాటింగ్ శైలిని మార్చి వికెట్ల ముందు దొరికింది. అయితే లిచ్‌ఫీల్డ్ రివ్యూ కోరింది.

రివ్యూలో బంతి అవుట్‌‌సైడ్ లెగ్‌‌గా స్పష్టంగా కనిపించింది. కానీ లిచ్‌ఫీల్డ్ రివర్స్ స్వీప్ చేయడంతో దాన్ని అవుట్‌సైడ్ లెగ్‌గా పరిగణించలేదు. థర్డ్ అంపైర్‌ నాటౌట్‌గా తేల్చాడు. దీనిపై స్మృతి మంధాన ఫీల్డ్ అంపైర్‌తో మాట్లాడింది. రివర్స్ స్వీప్ చేశారు కాబట్టి, కుడిచేతి వాటం బ్యాటర్‌గా పరిగణించాలని చెప్పింది. కానీ అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. కాగా, ఈ సమయంలో లిచ్‌ఫీల్డ్ 5 పరుగులే చేసింది. అనంతరం ఇన్నింగ్స్‌ చివరి వరకూ ఆడిన ఆమె‌ 9 బంతుల్లో అజేయంగా 15 పరుగులు చేసింది.

Story first published: Monday, October 14, 2024, 12:21 [IST]
Other articles published on Oct 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+