Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం టీమిండియా ఎంపిక..యువ ప్లేయర్లకు అవకాశం

భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. ఇటీవల ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాను టెస్టుల్లో చిత్తుగా ఓడించి టీమిండియా చరిత్ర స‌ృష్టించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో పరుగుల పరంగా రికార్డు విజయాన్ని సాధించిన హర్మన్‌ప్రీత్ సేన.. 46 ఏళ్లలో సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై తొలి విజయాన్ని అందుకుంది.

అయితే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లకు భారత మహిళా జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది. నలుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు‌కు వన్డే జట్టులో చోటు దక్కింది. ఇటీవల టీ20ల్లో అరంగేట్రం చేసిన శ్రేయాంక పాటిల్, టిటాస్ సాధు, సైకా ఇషాక్ వన్డే జట్టులో ఎంపికయ్యారు. మరోవైపు 20 ఏళ్ల మన్నత్ కశ్య‌కు వన్డే, టీ20 జట్టుల్లో అవకాశం దక్కింది.

India Women vs Australia Women: Team India has been selected for Australia series

ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. డిసెంబర్ 28 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అన్ని వన్డేలు ముంబయిలో వాంఖడే స్టేడియంలోనే జరగనున్నాయి. టీ20 సిరీస్ జనవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కాగా, అన్ని టీ20 మ్యాచ్‌లు ముంబయిలో డీవై పటేల్ స్టేడియంలో జరగనున్నాయి.

వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన , జెమిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా , రిచా ఘోష్ , అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు, పూజా వస్త్రాకర్, స్నేహ రానా, హర్లీన్ డియోల్

టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన , జెమిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా, రిచా ఘోష్, అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, ఠాకూర్, టిటాస్ సాధు, పూజా వస్త్రాకర్, కనికా అహుజా, మిన్ను మణి

Story first published: Monday, December 25, 2023, 16:00 [IST]
Other articles published on Dec 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+