ప్రపంచకప్‌నకు టీమిండియా ఎంపిక.. పాక్‌తోనే ఫస్ట్ మ్యాచ్

2022 మహిళల వన్డే ప్రపంచకప్‌నకు సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన ఈ జట్టుకు కెప్టెన్‌గా వెటరన్ బ్యాటర్ మిథాలీ రాజ్‌ను ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ ఎంపికైంది. సీనియర్ క్రీడాకారిణులు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి ఈ ప్రపంచకప్‌లో ఆడడంపై మొదట సందేహాలు నెలకొన్నాయి. అయితే వారిద్దరు సరైన ఫిట్ నెస్ సాధించడంతో సెలెక్టర్లు ప్రపంచకప్‌నకు ఎంపిక చేశారు. ఇద్దరు వికెట్ కీపర్లను ఎంపిక చేశారు. అలాగే స్టాండ్‌బై క్రీడాకారుణులుగా ముగ్గురిని ఎంపిక చేశారు. పలు కారణాలతో ఫాస్ట్ బౌలర్ శిఖా పాండే, ఇన్-ఫామ్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ ఈ ప్రపంచకప్ జట్టులో లేరు.

తొలి మ్యాచ్‌లో పాక్‌తో పోరు
న్యూజిలాండ్ వేదికగా ఈ ప్రపంచకప్ మార్చి 4 నుంచి ఏప్రిల్ 13 వరకు జరగనుంది. 2021లోనే ఈ ప్రపంచకప్ జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. మార్చి 6న మౌంట్ మాంగనూయి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అంతేకాకుండా ఇదే జట్టు ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్ పర్యటనలో ఆ జట్టుతో ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌తోపాలు ఒక టీ20 మ్యాచ్ కూడా ఆడనుంది. వన్డేలకు ప్రపంచకప్‌నకు ప్రకటించిన జట్టే అయినప్పటికీ టీ20 మ్యాచ్‌కు మాత్రం సెలెక్టర్లు వేరే జట్టును ప్రకటించారు.

లీగ్ స్టేజ్‌లో 7 మ్యాచ్‌లు
2017లో జరిగిన గత ప్రపంచకప్‌లో భారత జట్టు రనరఫ్‌గా నిలిచింది. సెమీఫైనల్‌లో బలమైన ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించి ఫైనల్ చేరింది. అయితే ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. రౌండ్ రాబిన్ పద్దతిలో జరగనున్న ఈ 2022 వరల్డ్‌కప్‌లో భారత జట్టు లీగ్ స్టేజ్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. 6న పాకిస్థాన్‌తో, 10న న్యూజిలాండ్‌తో, 12న వెస్టిండీస్‌తో, 16న ఇంగ్లండ్‌తో, 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, 27న సౌతాఫ్రికాతో భారత మహిళలు తలపడనున్నారు. ఏప్రిల్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

భారత జట్టు:
మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్-కీపర్), స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్-కీపర్), రాజేశ్వరి గయాక్వాడ్, పూనమ్ యాదవ్.
స్టాండ్‌బై ప్లేయర్స్: ఎస్. మేఘన, ఏక్తా బిష్త్, సిమ్రాన్ దిల్ బహదూర్.

కివీస్‌తో టీ20 మ్యాచ్‌కు భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్-కీపర్), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్-కీపర్). ), రాజేశ్వరి గయాక్వాడ్, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, ఎస్. మేఘన, సిమ్రాన్ దిల్ బహదూర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications