For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నగదు లేక ఇబ్బందిపడ్డ భారత క్రికెటర్లు.. సాబా కరీంపై బీసీసీఐ సీరియస్‌!!

India womens team stuck without allowance in West Indies, Neglagency of Saba Karim

ముంబై: మిథాలీ రాజ్ సారథ్యంలోని వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన భారత మహిళా క్రికెట్‌ జట్టు సభ్యులు డైలీ అలెవన్స్‌ (డీఏ) లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కొత్త నియమించబడ్డ బీసీసీఐ కార్యవర్గం జోక్యంతో డీఏను ఆగమేఘాలపై బదిలీ చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో భారత క్రికెట్‌ ఆపరేషన్స్‌ జీఎంగా, మహిళల క్రికెట్‌ జట్టుకు ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీ క్రికెటర్‌ సాబా కరీం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీసీసీఐ సీరియస్‌ అయ్యింది.

భారత క్రికెట్‌ జట్ల ఫైనాన్షియల్‌ వ్యవహారాలన్నీ సెప్టెంబర్ 18 వరకూ వినోద్‌ రాయ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ పరిపాలక కమిటీ (సీఓఏ) చూసేది. అయితే బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఆ బాధ్యతను సాబా కరీంకు అప్పగించారు. భాద్యతలు అప్పగిస్తూ సెప్టెంబర్‌ 23వ తేదీనే కరీంకు అధికారిక మెయిల్‌ పంపారు. గత నెలరోజులుగా (అక్టోబర్‌ 24) ఫైనాన్షియల్‌ వ్యవహారాలకు సంబంధించి సాబా కరీం ఏమీ పట్టించుకోలేదు.

ఇదే సమయంలో భారత మహిళల జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్ళింది. జట్టు సభ్యులకు డీఏ రూపంలో ఇవ్వాల్సిన నగదును ఇవ్వకుండా సాబా కరీం అలసత్వం ప్రదర్శించాడు. తమ అకౌంట్‌లు చెక్ చేసుకున్న భారత మహిళా జట్టు బృందం ఒక్కసారిగా షాకయ్యింది. ఈ విషయాన్ని బీసీసీఐకు తెలియజేసారు. బోర్డులో కొత్త నియమించబడ్డ కార్యవర్గం జోక్యంతో డీఏను ఆగమేఘాలపై బదిలీ చేయాల్సి వచ్చింది. దీంతో మహిళా జట్టు బృందంకు డీఏ అందింది.

నిర్లక్ష్యం చేసిన సాబా కరీంపై బీసీసీఐ సీరియస్‌ అయ్యింది. విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో ఇలాగేనా చేసేది అని ఓ బీసీసీఐ సీనియర్‌ అధికారి మండిపడ్డారు. 'ఇది చాలా సున్నితంగా పరిష్కరించాల్సిన విషయం. భారత అమ్మాయిలు విదేశీ పర్యటనకు వెళ్ళినపుడు వారి అకౌంట్‌లో ఒక్క రూపాయి కూడా లేకుండా పంపుతారా. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు' అని ఫైర్ అయ్యారు.

'సెప్టెంబర్‌ 18 నుంచే ఫైనాన్స్‌ వ్యవహారాలు సీఓఏ నుంచి సాబా కరీం చేతికి వచ్చింది. దాదాపు నెల సమయం ఉంది. అక్టోబర్‌ 24వ తేదీ వరకూ ఎందుకంత నిర్లక్ష్యం వహించారు. భారత మహిళా క్రికెటర్లకు డీఏ ఇవ్వవపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారు' అని సదరు అధికారి సిరీస్ అయ్యారు. విండీస్‌ పర్యటనలో భారత మహిళల జట్టు మూడు వన్డే, ఐదు టీ20ల సిరీస్‌ ఆడనుంది.

Story first published: Thursday, October 31, 2019, 17:20 [IST]
Other articles published on Oct 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+