For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ODI Tri Series: ముక్కోణపు వన్డే సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన

ODI Tri Series: భారత మహిళా క్రికెట్ జట్టు తన తదుపరి లక్ష్యం వైపు ముందుకు సాగుతోంది. భారత్ ఏప్రిల్ 27 నుంచి శ్రీలంకలో వన్డే ముక్కోణపు సిరీస్ ఆడనుంది. ఈ ట్రై సిరీస్ ఆతిథ్య శ్రీలంక, దక్షిణాఫ్రికా, భారత మహిళల జట్ల మధ్య జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత మహిళా జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి కెప్టెన్ గా ఎంపికైంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఈ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో శ్రీలంక భారత మహిళల జట్లు తలపడనున్నాయి. అలాగే రెండో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. మొత్తం 6 మ్యాచ్ లు జరగనుండగా.. ఆరు మ్యాచ్ ల తర్వాత టాప్ 2లో ఉన్న జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మే 11న కొలంబో వేదికగా జరగనుంది.

2025 వన్డే ట్రై సిరీస్ కోసం భారత మహిళల జట్టు ప్రకటన
ఏప్రిల్ 8న శ్రీలంక, దక్షిణాఫ్రికాతో జరిగే ముక్కోణపు సిరీస్ కోసం భారత మహిళా జట్టును ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. ముగ్గురు యువ ఆటగాళ్లు కేశ్వీ గౌతమ్, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్ మొదటిసారి అంతర్జాతీయ జట్టులో స్థానం పొందారు. సెలక్షన్ కమిటీ రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధులను కూడా ఎంపిక చేసింది. కానీ ప్రస్తుతం వారు గాయాల నుంచి పూర్తిగా కోలుకోలేదు.

India Women s Team Announcement for the Triangular Odi Series

షఫాలీ వర్మకు లభించని స్థానం
భారత మహిళల జట్టులో షఫాలీ వర్మకు స్థానం లభించలేదు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో ఆమె విఫలం కావడంతో జట్టులో చోటు దక్కించుకోవడంలో విఫలమవుతోంది. డబ్ల్యూపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున, దేశవాలీ క్రికెట్ లో షఫాలి బ్యాట్ తో అద్భుతంగా రాణించింది. కానీ ఆమెను మళ్లీ విస్మరించారు. 2025 డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 9 మ్యాచ్ ల్లో 304 పరుగులు చేసింది.

ముక్కోణపు సిరీస్ కోసం భారత జట్టు ఇలా..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్ ), యాస్తికా భాటియా (డబ్ల్యుకే), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, కేశ్వీ గౌతమ్, స్నేహ రాణా, అరుంధతీ రెడ్డి, తేజల్ హసాబినీస్, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్.

ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ ఇదే.. (భారత్ మ్యాచ్ లు)
ఏప్రిల్ 27 -భారత్ వర్సెస్ శ్రీలంక- కొలంబో
ఏప్రిల్ 29 -భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా -కొలంబో
మే 4-భారత్ వర్సెస్ శ్రీలంక -కొలంబో
మే 7 - భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా -కొలంబో
ఫైనల్ -మే11- కొలంబో

Story first published: Tuesday, April 8, 2025, 14:07 [IST]
Other articles published on Apr 8, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+