
హైదరాబాద్: శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత మహిళల జట్టుని బీసీసీఐ మహిళ సెలక్షన్ కమిటీ వెల్లడించింది. సెప్టెంబర్ 11 నుంచి ఈ పర్యటన ప్రారంభకానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరిస్ ఆడనుంది. వన్డే జట్టు కెప్టెన్‌గా మిథాలీ రాజ్, టీ-20 జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యవహరించనున్నారు.
సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్, 19వ తేదీ నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. గురువారం సీనియర్ పేసర్ జులన్ గోస్వామి టీ20ల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడంతో ఆమె పేరుని కేవలం వన్డేలకే పరిమితం చేశారు.
ఇటీవలే టీమిండియా మహిళా జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రమేశ్ పవార్‌కి ఇది తొలి పర్యటన కావడం విశేషం. మహిళల టీ20 వరల్డ్ కప్‌కు ముందు పవార్ కోచ్‌గా తన సత్తాను నిరూపించుకోవాల్సిన సిరిస్ ఇది.
వన్డే జట్టు:
మిథాలీ రాజ్(కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్(వైస్ కెప్టెన్), స్మృతి మందన్నా, పూనమ్ రౌత్, దీప్తీ శర్మ, డీ హేమ్‌లత, జెమియా రోడ్రిగ్యూస్, వేదా కృష్ణమూర్తి, తనియా భాటియా(కీపర్), ఎక్తా బిస్త్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, ఝులన్ గోస్వామి, మన్సీ జోషీ, శిఖా పాండే.
టీ20 జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మందన్నా(వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్, వేదా కృష్ణమూర్తి, జెమియా రోడ్రిగ్యూస్, డీ హేమ్‌లత, దీప్తీ శర్మ, అనుజా పాటిల్, తనియా భాటియా(కీపర్), ఎక్తా బిస్త్, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, మన్సీ జోషీ, శిఖా పాండే.