న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్లీన్‌స్వీప్ మిస్: టీ20 సిరీస్ భారత మహిళలదే

సిడ్నీ: ఆస్ట్రేలియాలో చారిత్రక సిరీస్‌ విజయం సాధించిన భారత మహిళల జట్టు ఆఖరి మ్యాచ్‌లో ఓడిపోయింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో ముగించింది. ఆదివారం చివరి మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు పరాజయంపాలైంది. దీంతో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసే అవకాశాన్ని కోల్పోయింది.

India women lose last T20I but clinch series 2-1

137 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన మిథాలీసేన నిర్ణీత ఓవర్లలో 121/8కే పరిమితమైంది. వనిత (28; 25 బంతుల్లో 3ఫోర్లు 1సిక్స్), వేద (21), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (24; 17 బంతుల్లో 1ఫోర్, 2సిక్స్‌లు) రాణించడంతో ఒక దశలో భారత్‌ 13.3 ఓవర్లలో 94/3తో గెలుపు దిశగా సాగింది.

అయితే, చివరి 6.3 ఓవర్లలో 27 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. పెర్రి (4/12), ఫారెల్‌ (2/18) భారత్‌కు విజయాన్ని దూరం చేశారు. పెర్రి (55 నాటౌట్‌), బెత్‌ మూనీ (34), లానింగ్‌ (26) చెలరేగడంతో మొదట ఆస్ట్రేలియా 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. జులన్‌ గోస్వామికి ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X