Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో టీ20లో భారత్ ఓటమి: 2-0తో సిరిస్ న్యూజిలాండ్ కైవసం

India women lose 2nd T20 to New Zealand, concede series

హైదరాబాద్: న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు... టీ20ల్లో మాత్రం ఆ మేరకు రాణించలేకపోయింది. ఆక్లాండ్ వేదిక‌గా శుక్రవారం జ‌రిగిన రెండో టీ 20 వ‌న్డేలో న్యూజిలాండ్ మ‌హిళ‌ల జ‌ట్టు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టుపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో న్యూజిలాండ్‌ కైవసం చేసుకుంది. తొలి టీ20లో భారత మహిళల జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే.

భారత్ బ్యాటింగ్

భారత్ బ్యాటింగ్

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు ఆరంభంలోనే తడబడింది. మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ ప్రియా పునియా పెవిలియన్‌కు చేరగా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమిమా రొడ్రిగస్‌తో కలిసి ఓపెనర్‌ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.

హాఫ్ సెంచరీతో రాణించిన రోడ్రిగ్స్‌

హాఫ్ సెంచరీతో రాణించిన రోడ్రిగ్స్‌

భారత బ్యాటర్స్‌లో జెమీమా రోడ్రిగ్స్‌(72) హాఫ్‌ సెంచరీ సాధించగా, స్మృతీ మంధాన(36) మోస్తరుగా రాణించారు. అయితే మంధాన ఔట్‌ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వారెవరూ క్రీజులో నిలదొక్కుకోకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 6 వికెట్లు నష్టపోయి 135 పరుగులు చేసింది. దీంతో భారత్ సాధారణ లక్ష్యాన్ని మాత్రమే కివీస్‌ ముందుంచింది.

కివీస్ విజయ లక్ష్యం 136

కివీస్ విజయ లక్ష్యం 136

అనంతరం భారత్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ జట్టు మొదట్లో కాస్త తడబడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్‌ సూజీ బేట్స్‌(62) నిలకడగా రాణించడంతో ఆఖరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో ఇంకా మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను న్యూజిలాండ్‌ మహిళలు 2-0తో కైవసం చేసుకున్నారు.

చివరి బంతికి విజయం

చివరి బంతికి విజయం

న్యూజిలాండ్‌ క్రీడాకారిణుల్లో సుజీ బేట్స్‌(62‌) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆమెకు తోడుగా అమీ సాటర్‌వైట్‌(23) రాణించడంతో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కివీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 136 పరుగులు చేసి విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 ఫిబ్ర‌వ‌రి 10న జ‌ర‌గ‌నుంది.

Story first published: Friday, February 8, 2019, 13:03 [IST]
Other articles published on Feb 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+