Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షెడ్యూల్ ఇదే: భారత్‌లో ఇంగ్లాండ్ మహిళల జట్టు పర్యటన

India women to host England in April

హైదరాబాద్: ఇంగ్లాండ్‌ మహిళలపై ప్రతీకారం తీర్చుకునేందుకు మిథాలీరాజ్‌ సేనకు మంచి అవకాశం లభించింది. ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మిథాలీసేన ఇంగ్లాండ్ జట్టు మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది.

ఏప్రిల్ 8, 11, 14 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు బీసీసీఐ సోమవారం వెల్లడించింది. ఈ ఏడాది ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో పర్యటించడానికి ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఆడనుంది.

మార్చి 12 నుంచి 18 మధ్యలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను బీసీసీఐ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగంగా తొలి సిరీస్‌ను భారత్‌ ఫిబ్రవరి 5 నుంచి 10 వరకు దక్షిణాఫ్రికాతో ఆడనుంది. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మిథాలీసేన మరే సిరీస్‌ ఆడలేదు. దీంతో సుదీర్ఘ విశ్రాంతి తర్వాత.. జట్టు ప్రదర్శనపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 26, 2017, 10:32 [IST]
Other articles published on Dec 26, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+