Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమ్మాయిలు అదుర్స్: కివీస్ చిత్తు, భారత్‌దే సిరీస్

బెంగళూరు: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-2తో కైవసం చేసుకుంది. చివరి, ఐదో వన్డేలో భారత్ జట్టు 9 వికెట్లతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది.

బుధవారం బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ 41 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బేట్స్ (42) మినహా ఇతర క్రీడాకారిణులు ఎవరూ రాణించలేకపోయారు.

India Women Clinch ODI Series vs New Zealand With Massive Win

భారత బౌలర్లు జులన్ గోస్వామి, గైక్వాడ్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 27.2 ఓవర్లలో కేవలం వికెట్ కోల్పోయి విజయాన్నందుకుంది. కామిని (78 బంతుల్లో 62 నాటౌట్, 13ఫోర్లు), దీప్తి శర్మ (78 బంతుల్లో 44 నాటౌట్, 8 ఫోర్లు) రాణించారు.

ఇది ఇలా ఉండగా, న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో 3-2తో గెలిచిన భారత మహిళలకు బిసిసిఐ రూ. 21లక్షల నజరానా ప్రకటించింది. మహిళల జట్టుకు శుభాకాంక్షలు చెప్పిన బిసిసిఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఈ మేరకు నజారానా ప్రకటించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+