Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదరగొట్టారు: విండిస్‌పై 3-0తో వన్డే సిరిస్ క్లీన్‌ స్వీప్

విజయవాడ: వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది. కృష్ణాజిల్లా మూలపాడులో ఏసీఏ-కేడీసీఏ మైదానంలో బుధవారం జరిగిన చివరి వన్డేలో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు అటు బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టింది.

ఫలితంగా భారత జట్టు 15 పరుగుల తేడాతో విండీస్‌పై విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో రాణించిన స్మృతి మంధాన (5), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (15), హర్మన్‌ప్రీత కౌర్‌ (19) పరుగులకే పెవిలియన్‌కు చేరారు.

India women beat West Indies in third ODI to complete series whitewash

వేదక కృష్ణమూర్తి 79 బంతులను ఎదుర్కొని 10 ఫోర్లతో 71 పరుగులతో అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన దీప్తి శర్మ (23), దేవిక వైద్య (32 నాటౌట్‌) కూడా పర్వాలేదనిపించారు. 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ 49.1 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది.

విండీస్‌ జట్టులో కైసియా నైట్‌ (55) టాప్‌ స్కోర్‌గా కాగా.. ఓపెనర్‌ హేలే మాథ్యూస్‌ (44) రాణించింది. వెస్టిండిస్ చేతిలో 5 వికెట్లు ఉన్నప్పుడు 20 బంతుల్లో 27 పరుగులు చేస్తే గెలిచేది. స్పిన్నర్ రాజేశ్వరీ (4/34) అద్భుతమైన బౌలింగ్‌తో విండీస్ ఆశలను ఆవిరి చేసింది. అయితే మూడు రనౌట్లు విండీస్‌ విజయావకాశాలను దెబ్బ తీశాయి.

చివరి 11 పరుగుల వ్యవధిలో విండీస్ జట్టు వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోరుుంది. వెస్టిండిస్ జట్టులో కైసియా నైట్‌ (55) టాప్‌ స్కోర్‌గా కాగా.. ఓపెనర్‌ హేలే మాథ్యూస్‌ (44) రాణించారు. ఇది ఐసీసీ గుర్తింపు పొందిన సిరీస్‌ కావడంతో భారతకు రెండు పాయింట్లు లభించాయి. ఈనెల 18న ఇదే మైదానంలో వెస్టిండిస్‌తో టి20 సిరీస్ జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+