అండర్-19 మహిళల ఆసియా కప్ 2024 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం కౌలాలంపూర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా బంగ్లాదేశ్ ను ఓడించింది. 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ మట్టికరిపించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. త్రిష మినహా ఎవరూ పెద్ద స్కోరు చేయలేకపోయారు. త్రిష 47 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసింది.
మిథిలా వినోద్ 12 బంతుల్లో 17 పరుగులు చేసింది. శుక్లా 10 పరుగులు చేయగా.. కమిలిని 5, సానికా చల్కే 0, కెప్టెన్ నికీ ప్రసాద్ 12 పరుగులు చేసింది. త్రిష, నికీ ప్రసాద్ మూడో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. కెప్టెన్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఐశ్వరి 5 పరుగులే చేసింది.
బంగ్లాదేశ్ బౌలర్లలో ఫర్జానా ఈస్మిన్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఫామ్‌లో ఉన్న నిషితా అక్తర్ నిషి రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత బ్యాటర్లు ఎక్కువగా ఆధిపత్యం చెలాయించకుండా చూసుకుంది.

118 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 18.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలిపోయింది. బంగ్లా మొదటి నుంచి తడబడింది.
మొసమ్మత్ ఎవా, సుమైయా అక్తర్ సింగిల్ డిజిట్‌ను దాటలేకపోయారు. ఓపెనర్ ఫహోమిదా చోయా 18, జుయారియా ఫెర్దౌస్ 22 పరుగులు చేశారు.
ఇవా డకౌట్ కాగా.. సుమైయా అక్తర్ సుబోర్నా 8, కెప్టెన్ సుమైయా అక్తర్ 4, సైదా అక్తర్ 5, జన్నతుల 3, హబిబా 1, ఫర్జానా 5, నిషిత అక్తర్ నిషి 1 పరుగు చేసింది.
టోర్నమెంట్‌ను టాప్ వికెట్ టేకర్‌గా ముగించిన శుక్లా 3 వికెట్లు పడగొట్టింది. సిసోడియా 2, సోనమ్ యాదవ్ 2, జోషిత ఒక వికెట్ పడగొట్టారు. రెండో ఓవర్‌లో వీజే జోషిత ఎవా అలౌట్ అయింది.