Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నరాలు తెగే ఉత్కంఠ: మ్యాజిక్ చేసిన బుమ్రా (ఫోటోలు)

హైదరాబాద్: సిరిస్‌ను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. చివరి బంతి వరకూ అంతులేని ఉత్కంఠ రేపిన రెండో టీ20లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చివరి ఓవర్‌లో మ్యాజిక్ చేసి, భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భారత్ 30 పరుగుల స్కోరువద్ద తొలి వికెట్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ రూపంలో కోల్పోయింది. కోహ్లీ 15 బంతుల్లో 21 పరుగులు చేసి, క్రిస్ జోర్డార్ బౌలింగ్‌లో లియామ్ డాసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సురేష్ రైనా (7), యువరాజ్ సింగ్ (4) క్రీజ్‌లోకి వచ్చినట్టే వచ్చి పెవిలియన్ చేరడంతో 69 పరుగులకే భారత్ మూడు వికెట్లు చేజార్చుకుంది. వీరిద్దరూ 13 పరుగుల వ్యవధిలో అవుట్ కావడంతో భారత్ తడబడింది. ఆ తరుణంలో రాహుల్‌కు జత కలిసిన మనీష్ పాండే ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశాడు.

నాలుగో వికెట్‌కు 56 పరుగులు జోడించారు

నాలుగో వికెట్‌కు 56 పరుగులు జోడించారు

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 56 పరుగుల జత చేయడంతో భారత్ తేరుకుంది. ఈ క్రమంలోనే రాహుల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో అర్ధ సెంచరీ సాధించాడు. అయితే భారత్ స్కోరు 125 పరుగుల వద్ద రాహుల్ బెన్ స్టోక్స్ క్యాచ్ పట్టగా క్రిస్ జోర్డాన్ పెవిలియన్ పంపాడు. ఆపై స్వల్ప వ్యవధిలో 26 బంతుల్లో 30 పరుగులు చేసిన మనీష్ పాండేను టైమల్ మిల్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది

ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది

ఇక చివర్లో హార్దిక్ పాండ్యా(2), అమిత్ మిశ్రా(0)లు రనౌట్ లుగా పెవిలియన్‌కు చేరగా, మహేంద్ర సింగ్ (5)లు అవుట్ కావడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. క్రిస్ జోర్డాన్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోగా మొయిన్ అలీ, రషిద్, మిల్స్‌లకు తలో వికెట్ దక్కింది. 145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుని 22 పరుగుల వద్ద ఆశిష్ నెహ్రా తొలి దెబ్బ తీశాడు.

ఇంగ్లాండ్ నడ్డి విరిచిన ఆశిష్ నెహ్రా

ఇంగ్లాండ్ నడ్డి విరిచిన ఆశిష్ నెహ్రా

ఒకే ఓవర్‌లో అతను సామ్ బిల్లింగ్స్ (12), జాసన్ రాయ్ (10)లను పెవిలియన్ పంపాడు. జట్టు స్కోరు 65 పరుగుల వద్ద కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వికెట్ కూలింది. 17 పరుగులు చేసిన అతనిని హార్దిక్ పాండ్య క్యాచ్ పట్టగా అమిత్ మిశ్రా అవుట్ చేశాడు. బెన్ స్టోక్స్ 27 బంతుల్లో, రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 39 పరుగులు చేసి ఆశిష్ నెహ్రా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

చివరి ఓవర్‌లో బుమ్రా అద్భుతం

చివరి ఓవర్‌లో బుమ్రా అద్భుతం

చివరి ఓవర్‌లో విజయానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిన ఇంగ్లాండ్‌ను కట్టడి చేసే బాధ్యతను జస్‌ప్రీత్ బుమ్రాకు భారత కెప్టెన్ కోహ్లీ అప్పచెప్పాడు. చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగులు చేయాల్సి ఉండగా బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతిలోనే జో రూట్‌ను అవుట్ చేశాడు. రెండో బంతికి మోయిన్ అలీ సింగిల్ తీయగా, మూడో బంతిలో ఒక్క పరుగు కూడా రాలేదు.

చివరి బంతిలో ఇంగ్లాండ్ గెలవడానికి ఆరు పరుగులు

చివరి బంతిలో ఇంగ్లాండ్ గెలవడానికి ఆరు పరుగులు

నాలుగో బంతిలో జొస్ బట్లర్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో బంతిలో ఒక పరుగు లెగ్‌బై రూపంలో ఇంగ్లాండ్‌కు లభించింది. దీనితో చివరి బంతిలో ఇంగ్లాండ్ గెలవడానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. కానీ, ఆ బంతికి మోయిన్ అలీ బీట్ కావడంతో ఒక్క పరుగు కూడా లభించలేదు. భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌల్ చేసిన జస్‌ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

సమర్థంగా బంతులు వేయడం అనుకున్నంత సులభం కాదు

సమర్థంగా బంతులు వేయడం అనుకున్నంత సులభం కాదు

ఈ అవార్డును స్వీకరించిన తర్వాత అతను మాట్లాడుతూ డెత్ ఓవర్లలో సమర్థంగా బంతులు వేయడం అనుకున్నంత సులభం కాదని అన్నాడు. అయతే, ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితుల్లోనే తాను చక్కగా రాణించిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని, ఎలాంటి అనుమానం లేకుండా చివరి ఓవర్‌కు సిద్ధమయ్యానని అన్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ చివరి ఓవర్‌ను సరిగ్గా ఆడలేకపోవడంతోనే ఓడామని అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+