For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ది రాక్'తో పోల్చుకుంటావా?: చాహల్‌ను ట్రోల్ చేసిన రోహిత్ శర్మ

Rohit Sharma Trolls Yuzvendra Chahal’s Shirtless Photo || Oneindia Telugu
India win series but someone else takes headlines: Rohit Sharma trolls Yuzvendra Chahal

హైదరాబాద్: తనను తాను హాలీవుడ్ హీరో డ్వేన్ 'ది రాక్' జాన్సన్‌తో పోల్చుకోవడంపై చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. షర్ట్‌లెస్ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ డ్వేన్ జాన్సన్‌తో యజువేంద్ర చాహల్ పోల్చుకోవడంపై ఓపెనర్ రోహిత్ శర్మ ట్రోల్ చేశాడు.

గత ఆదివారం ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడో వన్డే అనంతరం రోహిత్ శర్మ తన ట్విట్టర్‌లో "ఈ రోజు నేను చూసిన ఉత్తమ చిత్రం. ఈ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. కానీ హెడ్‌లైన్స్‌లో మాత్రం మరొకరు నిలిచారు" అంటూ చాహల్ ఫోటోని పోస్టు చేశాడు.

రోహిత్ శర్మ ట్వీట్‌కు చాహల్ సైతం తనదైన శైలిలో స్పందించాడు. చాహాల్ తన ట్వీట్‌లో "ది రాక్" అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను పోస్టు చేశాడు. కాగా, ఆస్ట్రేలియాలో ముగిసిన వన్డేల సిరిస్‌లో చోటు దక్కించుకున్నప్పటికీ చాహుల్‌కు తుది జట్టులో ఆడే అవకాశం లభింఛలేదు.

ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ 12వ ఆటగాడిగా యజువేంద్ర చాహల్ మైదానంలో బయట తన సహచర ఆటగాళ్లను ఇంటర్వ్యూలు చేశాడు. ఇక, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 29వ సెంచరీ.

ఈ సెంచరీతో రోహిత్ శర్మ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్‌గా రోహిత్‌శర్మ (29) అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్ (49) అగ్రస్థానంలో కొనసాగుతుండగా... విరాట్ కోహ్లీ (43), రికీ పాంటింగ్ (30) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

ఈ మ్యాచ్‌కి ముందు ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న లంక దిగ్గజ క్రికెటర్ సనత్‌ జయసూర్య(28)ను రోహిత్ శర్మ అధిగమించాడు. దీంతో పాటు వన్డేల్లో అత్యంత వేగంగా తొమ్మిది వేల పరుగుల మైలురాయిని సాధించిన మూడో క్రికెటర్‌గా రోహిత్ శర్మ (217) నిలిచాడు.

ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (194), ఏబీ డివిలియర్స్‌ (208) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. రోహిత్‌ శర్మ తర్వాత సౌరవ్ గంగూలీ (228), సచిన్ టెండూల్కర్ (235), బ్రియాన్ లారా (239)లు ఉన్నారు. భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ముగియడంతో కోహ్లీసేన కివీస్ పర్యటనకు సిద్ధమైంది.

ఇంకో నాలుగో రోజుల్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 5 టీ20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టులు ఆడనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనుంది.

Story first published: Tuesday, January 21, 2020, 14:28 [IST]
Other articles published on Jan 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+