For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్ పై భారత్ సునాయస విజయం, ఐదు వన్డేల సిరీస్ కైవసం

By Pratap
Gautam Gambhir
వడదొర: న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డే మ్యాచుల సరీస్ లో భారత్ వరుసగా మూడో వన్డేలో కూడా విజయం సాధించింది. మూడో వన్డే మ్యాచులో భారత్ కివీస్ పై సునాయస విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ ను మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. భారత బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. నిర్ణీత యాభై ఓవర్లలో న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడం భారత్ కు నల్లేరు మీద నడకే అయింది. భారత్ కెప్టెన్ గౌతం గంభీర్ వరుసగా రెండో సెంచరీ సాధించాడు. మూడో వన్డేలో మరోసారి అద్భుతంగా ఆడి 88 బంతుల్లో సెంచరీ సాధించాడు. రెండో వన్డే మ్యాచులోనూ అతను సెంచరీ చేశాడు.

అద్భుతమైన ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ సిక్స్ తో విజయాన్ని అందించాడు. మురళీ విజయ్ వికెట్ మాత్రమే కోల్పోయి భారత్ న్యూజిలాండ్ పై విజయం సాధించింది. మురళీ విజయ్ 30 పరుగులు చేశాడు. కాగా, కెప్టెన్ 126 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. విరాట్ కోహ్లీ 63 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ పై భారత జూనియర్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నారనడానికి ఈ వరుస విజయాలు నిదర్శనం.

106 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ను నాథన్ మెక్ కుల్లం, ఫ్రాంక్లిన్ ఆదుకున్నారు. భారత బౌలర్లకు వారు పరీక్ష పెట్టారు. ఫ్రాంక్లిన్ 72 పరుగులు చేయగా, నాథన్ మెక్ కుల్లం 49 పరుగులు చేసి అవుటయ్యాడు. భారత స్పిన్నర్ల బౌలింగ్ లో పరుగులు రాబట్టుకోవడానికి కివీస్ బ్యాట్స్ మెన్ ఎనలేని ఇబ్బందులు పడ్డారు. జహీర్ ఖాన్, అశ్విన్, యూసుఫ్ పఠాన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇద్దరు రన్నవుటయ్యారు. మునాఫ్ పటేల్ కు ఓ వికెట్ వచ్చింది.

స్కోర్ బోర్డు
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+