ఉత్కంఠభరితమైన డ్రా: సిరీస్ భారత్ వశం
బెంగుళూరు: భారత్ ను దురదృష్టం వెన్నాడడంతో పాకిస్తానుతో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. బెంగుళూరులో జరిగిన మూడో టెస్టులో భారత్ నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ ఏడు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే తొలి ఐదు వికెట్లు పడగొట్టగా, ప్రమాదకర బ్యాట్స్‌మెన్ మిస్బావుల్ హక్‌ను, అనంతరం అరాఫత్‌ను యువరాజ్ సింగ్ వరుస ఓవర్లలో పెవీలియన్ దారి పట్టించాడు. అయితే వెలుతురు సరిగా లేని కారణంగా ఆట మరో 12 ఓవర్లు ముగిసి ఉండగానే ముగిసింది. దీంతో ఆట డ్రాగా ముగిసింది. భారత్ మూడు టెస్టుల సిరీస్ ను 1-0 స్కోరుతో గెలుచుకుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత స్వదేశంలో భారత్ పాకిస్తాన్ పై సిరీస్ ను గెలిచింది. పాకిస్తాన్ రెండో ఇన్నింగ్సులో 32 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఆటను ముగించడానికి చాలాసేపు మైదానంలో నిరీక్షించారు. ఎట్టకేలకు కుంబ్లే ఆటను ముగించడానికి అంగీకరించాడు. సౌరవ్ గంగూలీ మ్యాన్ ఆఫ్ ద ప్లేయరుగా ఎంపికయ్యాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా కూడా గంగూలీనే ఎంపికయ్యాడుకుంబ్లే దెబ్బకు వరుసగా యాసిర్ హమీద్ (39), కెప్టెన్ యూనిస్ ఖాన్ (0), సల్మాన్ బట్ (8) పైసల్ ఇక్బాల్ (51), కమ్రాన్ అక్మల్ (0)లు తక్కువ వ్యవధిలోనే నిష్క్రమించారు. అనంతరం యూవరాజ్ సింగ్ సిరీస్ మొత్తం మంచి ఫామ్‌ను కొనసాగించిన మిస్బాను పెవిలియన్ దారి పట్టించాడు.అంతకు ముందు ఆరు వికెట్ల నష్టానికి 284 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం ద్వారా పాక్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్ణయించింది. గంగూలీ (91), కార్తీక్ (52), ద్రావిడ్ (42)లు రాణించారు. పాక్ బౌలర్లలో మొహ్మద్ సమీ, యాసీర్ అరాఫత్‌లు రెండేసి వికెట్లు పడగొట్టగా, డేనిష్ కనేరియా, షోయబ్ అక్తర్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు.
Story first published: Sunday, December 23, 2007, 23:53 [IST]
Other articles published on Dec 23, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications