పాక్ పై భారత్ ఆరు వికెట్ల విజయం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన క్రికెట్ తొలి టెస్టు మ్యాచులో పాకిస్తానుపై భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుచుకుంది. పాకిస్తాను భారత్ ముందుంచిన 203 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో భారత్ పాకిస్తానుపై 1-0 స్కోరుతో సిరీసులో ముందంజలో ఉంది. కెప్టెనుగా అనిల్ కుంబ్లేకు ఇది తొలి విజయం. టెస్టుల్లో భారత్ కు వరుసగా ఇది ఏడో విజయం. కుంబ్లే మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యాడు. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్సులో 231 పరుగులు చేయగా భారత్ 276 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్సులో పాకిస్తాను 247 పరుగులు మాత్రమే చేయగలిగింది.రెండో ఇన్నింగ్సులో సచిన్ టెండూల్కర్ అర్థ సెంచరీ పూర్తి చేసుకుని నాటవుటుగా నిలిచాడు. అతను 56 పరుగులు చేశాడు. ఆదివారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసిన భారత్ సోమవారం ఉదయం 6.2 ఓవర్లలో 32 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం ఉదయం 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గంగూలీ అక్తర్ బౌలింగులో అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్సులో నాలుగు వికెట్లు కూడా అక్తర్ కే లభించాయి. గంగూలీ, టెండూల్కర్ నాలుగో వికెట్ భాగస్వామ్యానికి 88 పరుగులు జోడించారు. బ్యాటింగులోనూ, బౌలింగులో భారత కెప్టెన్ కుంబ్లే కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్సులో లక్ష్మణ్ చేసిన 72 పరుగులు, ధోనీ చేసిన 57 పరుగులు మ్యాచులో నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. అలాగే గంగూలీ ఆల్ రౌండు ప్రతిభ మ్యాచు భారత్ వశం కావడానికి తోడ్పడింది.
Story first published: Monday, November 26, 2007, 23:53 [IST]
Other articles published on Nov 26, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications