72 ఏళ్ల రికార్డు బద్దలు: చరిత్ర సృష్టించిన కోహ్లీసేనపై ప్రశంసల వర్షం


హైదరాబాద్: ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్ గెలిచి టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. దీంతో ఆసీస్ గడ్డపై 72 ఏళ్ల విరామానికి టీమిండియా తెరదించింది.
గత గురువారం సిడ్నీ వేదికగా ప్రారంభమైన చివరి టెస్టులో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ వర్షం పదే పదే అంతరాయ కలిగించడంతో పూర్తి ఆట సాధ్యం కాలేదు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 622/7 డిక్లేర్ చేయగా, ఆసీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది.
దీంతో ఆస్ట్రేలియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫాలో ఆన్‌కు ఆహ్వానించాడు. నాలుగో రోజైన ఆదివారం ఆటలో ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా ఆరు పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం పడింది. చివరి రోజు ఆటకు సైతం వరుణుడు అడ్డుపడటంతో ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది.
సిడ్నీ టెస్టులో సెంచరీ సాధించిన ఛటేశ్వర్ పుజారా(193) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించగా, పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ 146 పరుగుల తేడాతో నెగ్గింది.
ఆ తర్వాత మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 137 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరిస్‌లో పుజారా 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, భారత బౌలర్లలో బుమ్రా (21 వికెట్లు) అగ్రస్థానంలో నిలవగా షమీ 16 వికెట్లు, ఇషాంత్ శర్మ 11 వికెట్లు తీశారు.
రామ్‌నాథ్ కోవింద్
ఆస్ట్రేలియాలో తొటిసారిగా టెస్టు సిరీస్‌ను గెలిచినందుకు కోహ్లీ సేనకు శుభాభినందనలు. టీమిండియా ఆల్‌రౌండ్ ప్రతిభ మమ్మల్ని గర్వపడేలా చేసింది. దీన్నే అలవరచుకోండి
ఐసీసీ
ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచి కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది
వీరేంద్ర సెహ్వాగ్
మరిచిపోలేని ఈ విజయాన్ని అందించిన టీమిండియాకు అభినందనలు. భారత్‌లోని ప్రతి క్రికెట్ అభిమాని గర్వపడుతున్నాడు. టీమిండియా సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైంది
హర్భజన్ సింగ్
టీమిండియా అద్భుతంగా ఆడింది. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా. భారత బ్యాటింగ్ లైనప్‌కి వెన్నెముకగా నిలిచిన పుజారాకు అభినందనలు. కీపిటప్. బుమ్రా బౌలింగ్ అద్భుతం
మహమ్మద్ కైఫ్
ఈ చారిత్రక విజయం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది
మిచెల్ జాన్సన్
తొలిసారిగా ఆసీస్‌లో సిరీస్ నెగ్గిన టీమిండియాకు అభినందనలు. మీ ప్రదర్శన ఎంతో నచ్చింది
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications