Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2002లో లార్డ్స్‌లో ఏం జరిగిందో రెండో వన్డేలో అదే పునరావృతం అవుతుంది: గంగూలీ

లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పిన గంగూలీ: నేటితో 16 ఏళ్లు పూర్తి
India will win the ODI series in Lords like we did in 2002: Sourav Ganguly

హైదరాబాద్: 2002లో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మేము ఎలాగైతే నాట్‌వెస్ట్‌ సిరీస్‌ గెలిచామో.. ఇప్పుడు కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా కూడా రెండో వన్డే గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంటుందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. భారత్-ఇంగ్లాండ్ సిరిస్‌కు కామెంటేటర్‌గా వ్యవహారిస్తోన్న సౌరవ్ గంగూలీ ప్రస్తుతం గంగూలీ ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నాడు.

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా శనివారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా రెండో వన్డేలో కోహ్లీసేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లాండ్‌ గడ్డపై వరుసగా రెండో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్‌ ఉవ్విళ్లూరుతుండగా... ఎలాగైనా, రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో రెండో వన్డేకు ముందు గంగూలీ మాట్లాడుతూ "2002 జులై 13న లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై మేము ఎలాగైతే నాట్‌వెస్ట్‌ సిరీస్‌ సొంతం చేసుకున్నామో... సరిగ్గా అలాగే కోహ్లీ సేన ఈ రోజు అదే మైదానంలో ఇంగ్లాండ్‌పై రెండో వన్డే గెలిచి ఈ సిరీస్‌ కైవసం చేసుకుంటుంది" అని అన్నాడు.

1
42372

"ప్రస్తుత పర్యటనలో టీమిండియా ఇంగ్లిష్‌ జట్టుతో మూడు టీ20లు, ఒక వన్డే అంటే మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌ల్లో భారత్‌దే పూర్తి ఆధిపత్యం. ఇందులో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ ఓ భారత బ్యాట్స్‌మన్ సెంచరీ సాధించాడు" అని గంగూలీ గుర్తు చేశాడు.

"మిగతా వాటి కంటే కార్డిఫ్‌ పిచ్‌ కాస్త భిన్నం. ఇప్పటికైనా ఇంగ్లాండ్‌ మేల్కోవాలి. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోతే మరో మ్యాచ్‌లో భారత్‌దే పూర్తి ఆధిపత్యం అవుతుంది" అని గంగూలీ వెల్లడించాడు. 2002లో ఇదే లార్డ్స్‌లోఇంగ్లాండ్‌తో జరిగిన నాట్ వెస్ట్ ఫైనల్లో గంగూలీ నాయకత్వంలోని టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, July 14, 2018, 12:56 [IST]
Other articles published on Jul 14, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+