IND vs BAN: ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరగనున్న వైట్ బాల్ సిరీస్‌ను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఈ సిరీస్ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆగస్టులో భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. మీర్పూర్, చిట్టగాంగ్ వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ పర్యటన ఆగస్టు 17న ప్రారంభమై ఆగస్టు 31న ముగుస్తుంది. ఈ పర్యటన ఆగస్టు 17, 20, 23 తేదీల్లో వన్డే సిరీస్‌తో ప్రారంభమవుతుంది. ఆగస్టు 26, 29, 31 తేదీల్లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతాయి.
రెండు జట్ల మధ్య పూర్తి షెడ్యూల్ ఇదే..
వన్డే షెడ్యూల్ ఇలా..
మొదటి వన్డే - ఆగస్టు 17 (మీర్పూర్)
రెండవ వన్డే - ఆగస్టు 20 (మీర్పూర్)
మూడో వన్డే - ఆగస్టు 23 (చిట్టగాంగ్)
టీ20 షెడ్యూల్ ఇలా..
మొదటి టీ20 మ్యాచ్ - ఆగస్టు 26 (చిట్టగాంగ్)
రెండో టీ20 మ్యాచ్ - 29 ఆగస్టు (మీర్పూర్)
మూడో టీ20 మ్యాచ్ - ఆగస్టు 31 (మీర్పూర్)

ప్రస్తుతం భారత క్రికెటర్లంతా ఐపీఎస్ 2025తో చాలా బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఏపీఎల్ మే 25న ముగియనుండగా.. అనంతరం భారత జట్టు ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఇంగ్లాండ్ తో భారత్ 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 4న ముగుస్తుంది. ఈ సిరీస్ తర్వాత్ భారత్ బంగ్లాదేశ్ లో పర్యటించనుంది.
ఇంగ్లండ్ లో భారత్ షెడ్యూల్ ఇలా..
తొలి టెస్టు- జూన్ 20-24
రెండో టెస్టు -జులై 2-6
మూడో టెస్టు -జులై 10-14
నాలుగో టెస్టు -జులై 23-27
ఐదో టెస్టు -జులై 31-ఆగస్టు 4
భారత్ బంగ్లాదేశ్ పర్యటన అనంతరం సెప్టెంబర్ నెలలో ఖాళీగా ఉండి అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్ తో స్వదేశంలో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. అనంతరం నవంబర్-డిసెంబర్ లో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్ ఇలా..
తొలి టెస్టు-అక్టోబర్ 2-6 (అహ్మదాబాద్)
రెండో టెస్టు - అక్టోబర్ 10-14(కోల్‌కతా)
భారత్ లో దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్ ఇలా..
తొలి టెస్టు-నవంబర్ 14-18(ఢిల్లీ)
రెండో టెస్టు -నవంబర్ 22-26(గౌహతి)
సౌతాఫ్రికాతో వన్డేలు ఇలా..
తొలి వన్డే -నవంబర్ 30(రాంచీ)
రెండో వన్డే-డిసెంబర్ 3(రాయ్ పూర్)
మూడో వన్డే -డిసెంబర్ 6(వైజాగ్)
సౌతాఫ్రికాతో టీ20 మ్యాచ్ లు ఇలా..
తొలి టీ20-డిసెంబర్ 9(కటక్)
రెండో టీ20 -డిసెంబర్ 11(చంఢీగఢ్)
మూడో టీ20 -డిసెంబర్ 14 (ధర్మశాల)
నాలుగో టీ20 -డిసెంబర్ 17(లక్నో)
ఐదో టీ20 -డిసెంబర్ 19(అహ్మదాబాద్)
రెండు స్వదేశీ సిరీస్‌ల మధ్య టీమిండియా ఆస్ట్రేలియాలో 3 వన్డేలు , 5 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడుతుంది. ఈ నెల ప్రారంభంలో క్రికెట్ ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్‌ను ప్రకటించింది, అక్టోబర్ 19 నుంచి వన్డేలు, అక్టోబర్ 29 నుంచి టీ20లు ప్రారంభమవుతాయి.
ఆస్ట్రేలియాతో భారత పర్యటన ఇలా..
తొలి వన్డే -అక్టోబర్ 19(పెర్త్)
రెండో వన్డే -అక్టోబర్ 23(అడిలైడ్)
మూడో వన్డే -అక్టోబర్ 25(సిడ్నీ)
టీ20 షెడ్యూల్ ఇలా..
తొలి టీ20 -అక్టోబర్ 29(కాన్‌బెర్రా)
రెండో టీ20-అక్టోబర్ 31(మెల్బోర్న్)
మూడో టీ20 -నవంబర్ 2(హోబర్ట్)
నాలుగో టీ20 -నవంబర్ 6(గోల్డ్ కోస్ట్)
ఐదో టీ20 -నవంబర్ 8(బ్రిస్బేన్)