
హైదరాబాద్: సన్ రైజర్స్ ఆటగాళ్లు ధావన్, రషీద్‌లు ప్రత్యర్థులుగా మారి పోటీపడనున్నారు. త్వరలో అఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టులో పరుగులు రాబడతానని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ధీమా వ్యక్తం చేశాడు. అఫ్గనిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్‌ని సమర్థంగా ఎదుర్కొని బౌండరీలు సాధిస్తానని పేర్కొన్నాడు.
జూన్ 14 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, అఫ్గనిస్థాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్‌లో ధావన్, రషీద్ ఖాన్ ఇద్దరూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకే ఆడటంతో.. అతడ్ని ఎదుర్కొనే అవకాశం ఇంతవరకూ ధావన్‌కి రాలేదు. దీంతో.. రషీద్‌ని ఎదుర్కోవడం కష్టమే అయినా.. సవాల్‌గా తీసుకుని ఆడతానని ధావన్ వెల్లడించాడు.
'రషీద్ ఖాన్ బౌలింగ్‌ని తొలిసారి ఎదుర్కోబోతున్నాను. అతడి స్పిన్‌ని ఛేదించాలంటే చాలా కష్టమని నాకు తెలుసు. కానీ.. అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఏకైక టెస్టులో బరిలోకి దిగే భారత తుది జట్టులో నాకు అవకాశం దక్కితే.. రషీద్ ఖాన్ బౌలింగ్ రూపంలో నాకు ఓ కఠిన సవాల్ ఎదురుకానుంది' అని ధావన్ వెల్లడించాడు.
భారత టెస్టు జట్టులో మురళీ విజయ్, కేఎల్ రాహుల్ రూపంలో ఓపెనింగ్ స్థానానికి పోటీ పెరగడంపై మాట్లాడుతూ 'భారత జట్టులో ఇలా పోటీ పెరగడం మంచిదే. ముగ్గరం మంచి అనుభవం ఉన్న ఓపెనర్లం. ఇటీవల ముగిసిన ఐపీఎల్ కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడాడు. తుది జట్టులో స్థానం నిలుపుకోవడం ఒకింత ఒత్తిడితో కూడుకున్నదే. కానీ.. ప్రతి జట్టులోనూ ఇలాంటి ఒత్తిడి సహజం' అని శిఖర్ ధావన్ వివరించాడు.
ఆడనున్న ఇరు జట్లు ఆటగాళ్ల వివరాలు:
టీమిండియా:
1. అజింక్య రహానే(కెప్టెన్)
2. శిఖర్ ధావన్
3. మురళీ విజయ్
4. కేఎల్ రాహుల్
5. చతేశ్వర్ పుజారాః
6. కరుణ్ నాయర్
7. సాహా (వికెట్ కీపర్)
8. రవిచంద్రన్ అశ్విన్,
9. రవీంద్ర జడేజా
10. కుల్దీప్ యాదవ్
11. ఉమేశ్ యాదవ్
12. మహ్మద్ షమీ
13. హార్దిక్ పాండ్య
14. ఇషాంత్ శర్మ
15. శార్ధూల్ ఠాకూర్.
అఫ్గాన్ జట్టు:
1. అస్గర్ స్టానిక్‌జాల్
2. మొహమ్మద్ షాజాద్
3. జావేద్ అహ్మది
4. రహ్మ త్ సింగ్
5. ఇహ్‌సానుల్పాహ జనత్
6. నజీర్మ జమాల్
7. హస్మతుల్లా షాహిదీ
8. అఫ్సర్ జజాయ్
9. మొహమ్మద్ నబీ
10. రషీద్ ఖాన్
11. జహీర్ ఖాన్
12. హమ్జా హోటక్
13. సయ్యద్ అహ్మద్ షిర్జాద్
14. యామిన్ అహ్మద్‌జై
15. వఫాదర్
16. ముజీబ్ ఉర్ రహ్మన్