T20 World Cup 2022: గ్రూప్-2లో అగ్రస్థానంలో భారత్.. కానీ రన్ రేట్‍లో మాత్రం..

టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2022లో దూసుకెళ్తోంది. గురువారం సిడ్నీలో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు పాకిస్థాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రస్తుతం భారత్ గ్రూప్-2లో రెండు మ్యాచ్ ల్లో రెండింటిలో విజయం సాధించి 4 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉంది.
సౌతాఫ్రికా రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. 3 పాయింట్లతో రెండు స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో జింబాబ్వే, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఉన్నాయి. నెదర్లాండ్స్ చివరి స్థానంలో ఉంది.

సౌతాఫ్రికాతో
టీమ్ ఇండియా తన తదుపరి మ్యాచ్ ను సౌతాఫ్రికాతో ఆడనుంది. అక్టోబర్ 30న పెర్త్ లో సాయంత్రం 4:30 గంటలకు భారత్, దక్షిణాఫ్రికా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డు తగిలే అవకాశం ఉంది. వర్షం కారణంగా ఈ గ్రూప్ లో ఇప్పటికే దక్షిణాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్ రద్దు అయింది. గ్రూప్-2లో రన్ రేట్ పరంగా సౌతాఫ్రికా టాప్ లో ఉంది. దక్షిణాఫ్రికా 5.2 రన్ రేటుతో ఉండగా.. భారత్ 1.42 రన్ రేటుతో రెండు స్థానంలో ఉంది.

రెండింటిలో ఓడిన పాక్
గ్రూప్-2లో ఫెవరేట్ గా ఉన్న పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. పాక్ ఇండియా, జింబాబ్వే చేతిలో ఓటమి పాలయింది. పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ తలపడనుంది. ఇటు నెదర్లాండ్స్ కూడా ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఇండియా, బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. జింబాబ్వే రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలుపొందగా.. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.

భారత జట్టు (ప్రాబబుల్స్)
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రవి , శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్.

దక్షిణాఫ్రికా జట్టు(ప్రాబబుల్స్)
ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, రీజా హెండ్రిక్స్, రిలీ రోసోవ్, టెంబా బావుమా, ట్రిస్టన్ స్టబ్స్, ఆండిలే ఫెహ్లుక్వాయో, హెన్రిచ్ క్లాసెన్, క్వింటన్ డి కాక్, అన్రిచ్ నోర్ట్జే, ఇమాద్ ఫోర్టుయిన్, కగిసో రబడా, కేశవ్ న్బ్రా మహరాజ్, లిజాడికో విల్బ్రాస్, లిజాడికో విల్బ్రామ్స్, షమ్సీ, వేన్ పార్నెల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications