పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లపై తేల్చేసిన బీసీసీఐ - కీలక ప్రకటన..!!

ముంబై: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2022 గడువు సమీపించింది. ఇంకో 48 గంటల్లో ఈ మెగా ఈవెంట్ ఆరంభం కాబోతోంది. 16వ తేదీ నుంచి గ్రూప్ దశ మ్యాచ్‌లు మొదలవుతాయి. 21వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. అప్పుడే అసలు సిసలు పోరు మొదవుతుంది. సూపర్ 12కు చేరిన జట్లు హోరాహోరీగా తలపడతాయి. 22వ తేదీన సూపర్ 12 దశ మొదలవుతుంది.
తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య షెడ్యూల్ అయింది. ఆ మరసటి రోజే భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొంటుంది. ఈ వరల్డ్‌కప్ కోసం ప్రస్తుతం రోహిత్ సేన ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లతో బిజీగా గడుపుతోంది. దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లింది. న్యూజిలాండ్‌లో ఆ దేశ జట్టుతో ముక్కోణపు సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నాయి. ఈ ముక్కోణపు సిరీస్ ఫైనల్‌లో న్యూజిలాండ్-పాకిస్తాన్ ఆడుతున్నాయి. క్రైస్ట్‌చర్చ్‌లో మ్యాచ్ సాగుతోంది.

వచ్చే అయిదేళ్లల్లో..
కాగా- టీమిండియాకు సంబంధించిన వచ్చే అయిదేళ్ల సైకిల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ విడుదల చేసింది. 2023-2027 మధ్య టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లతో కూడిన సైకిల్ ఇది. అన్ని ఫార్మట్లల్లో భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. ఒక్కో ఫార్మట్‌లో ఎన్నేసి మ్యాచ్‌లను ఆడుతుందనే విషయాన్ని స్పష్టం చేసింది.

అన్ని ఫార్మట్లల్లో..
దీని ప్రకారం చూసుకుంటే- ఈ అయిదేళ్ల వ్యవధిలో భారత్ మొత్తంగా ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను ఆడుతుంది. ఇందులో టెస్టుల సంఖ్య 38. 20 స్వదేశంలో మిగిలిన 18 మ్యాచ్‌లను విదేశీ గడ్డపై ఆడుతుంది. ఈ అయిదేళ్లల్లో టీమిండియా ఆడబోయే వన్డే ఇంటర్నేషనల్స్ 42గా నిర్ధారించింది. ఇందులో 21 స్వదేశంలో మిగిలినవి విదేశాల్లో షెడ్యూల్ చేసిన బీసీసీఐ.

తగ్గిన మ్యాచ్‌ల సంఖ్య..
ఈ రెండింటి కంటే ధనాధన్ ఫటాఫట్ ఫార్మట్ టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లు అధికంగా ఉన్నాయి. 2023-2027 మధ్యకాలంలో టీమిండియా ఏకంగా 61 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. ఇందులో 31 మ్యాచ్‌లు స్వదేశంలో షెడ్యూల్ అయ్యాయి. కాగా- ప్రస్తుత అయిదేళ్ల సైకిల్ అంటే 2018-2023తో పోల్చుకుంటే టీమిండియా ఆడే మ్యాచ్‌ల సంఖ్య తగ్గింది. ఈ అయిదేళ్లల్లో టీమిండియా 163 మ్యాచ్‌లను ఆడాల్సి ఉండగా.. నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్‌లో ఈ సంఖ్యను 141కి కుదించింది బీసీసీఐ.

ఐపీఎల్ వల్లే..
దీనికి కారణం ఏమిటనే విషయాన్ని తెలుసుకోవడానికి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ- ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించిందనడంలో సందేహాలుు అక్కర్లేదు. ఈ అయిదేళ్లల్లో కూడా టీమిండియా.. ద్వైపాక్షిక సిరీస్‌లల్లో భాగంగా పాకిస్తాన్‌కు వెళ్లడం గానీ లేదా పాకిస్తాన్ జట్టు భారత పర్యటనకు రావడం గానీ జరగదు. ఆ ఊసే ఎత్తలేదు బీసీసీఐ. ఆసియా కప్ సహా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నమెంట్స్‌లల్లో మాత్రమే భారత్-పాకిస్తాన్ ఎదురుపడతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications