ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టు ఆడేది లేదు: స్పష్టం చేసిన బీసీసీఐ

హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా డై/నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు అధికారికంగా లేఖ రాసింది. ఈ ఏడాది చివరిలో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.
ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రతి పర్యాటక జట్టుతోనూ క్రికెట్ ఆస్ట్రేలియా డే/నైట్ టెస్టును నిర్వహిస్తోంది. భారత జట్టుతో కూడా అదే విధంగా డే/నైట్ టెస్టు ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరింది. అయితే సీఏ కోరికను బీసీసీఐ తిరస్కరించింది.
డే/నైట్ టెస్ట్ ఆడాలంటే ఆటగాళ్లకు కనీసం 18నెలల పాటు ప్రాక్టీస్ అవసరమని టీమిండియా కోచ్ రవిశాస్త్రి సుప్రీం కోర్టు నియమించిన కమిటీ పాలకుల కమిటీ సభ్యులతో స్పష్టం చేశారని, ఈ సమాచారాన్ని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్‌కు పంపామని తెలిపారు.

డే/నైట్ టెస్టు కనీసం 12 నుంచి 18 నెలలు
'డే/నైట్ టెస్టు ఆడాలంటే కనీసం 12 నుంచి 18 నెలల పాటు లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ చేయాలి. ప్రస్తుతం వరుస సిరీస్‌ల కారణంగా ఇది టీమిండియాకు కుదరడం లేదని కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కమిటీ సభ్యులు వెంటనే బీసీసీఐకి అధికారికంగా లేఖ రాశారు' అని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

అడిలైడ్ టెస్టును డే/నైట్ టెస్టుగా
కాగా, డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా జరిగే టెస్టును డే/నైట్ టెస్టుగా నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్లాండ్ మాట్లాడుతూ ఆసీస్ పర్యటనలో గెలుపు కోసమే బీసీసీఐ డే/నైట్ టెస్టుకు ఒప్పుకోవడం లేదని, భవిష్యత్తులో టెస్టుల పరిస్థితి గురించి ఆలోచించడం లేదని వ్యాఖ్యానించాడు.

సీఏ ప్రతిపాదనను తిరస్కరించిన బీసీసీఐ
అడిలైడ్ వేదికగా జరగనున్న తొలి టెస్టును డే/నైట్ టెస్టుగా ఆడించాలని క్రికెట్ ఆస్ట్రేలియా బీసీసీఐతో చర్చలు జరిపింది. అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. అయితే డే/నైట్ టెస్ట్ ఆడబోమని భారత్ స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలన్న తపన వల్లే భారత్ డే/నైట్ టెస్టుకు విముఖత వ్యక్తం చేస్తోందని జేమ్స్ సదర్లాండ్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం.

ఆసీస్ పర్యటనలో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు
ఈ ఏడాది నవంబర్ 21 నుంచి జనవరి 19 వరకు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications