For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్తాన్‌తో ఆ టోర్నీపై ఆశలేవైనా ఉంటే.. వదిలేసుకోవచ్చు!!

India will not be travelling to Pakistan for the next year to participate in Asia Cup 2023

ముంబై: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ రెండు దేశాలు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాయంటే దానిపై ఏర్పడే అంచనాలు ఆకాశాన్ని అంటుతుంటాయి. క్రికెట్‌ను మించి..- అనే రేంజ్‌లో భావిస్తుంటారు అభిమానులు. తెలియకుండానే ఓ హై ప్రెషర్ ఏర్పడుతుంటుంది. అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు గురి అవుతుంటారు. రెండు జట్ల మధ్య మ్యాచ్‌గా కంటే రెండు దేశాల మధ్య జరిగే యుద్ధంగా భావిస్తుంటారు ఫ్యాన్స్.

క్రికెట్‌కు మించి..

క్రికెట్‌కు మించి..

టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ చూస్తారు. రోడ్డు పక్కన షోరూమ్ లేదా ఏదైనా షాప్‌లో టీవీలో మ్యాచ్ టెలికాస్ట్ అవుతోంటే అక్కడే నిల్చుని మ్యాచ్‌ను చూసే అతి అరుదైన సన్నివేశాలు భారత్-పాకిస్తాన్‌కు మాత్రమే సాధ్యం. ఈ రెండు దేశాల్లో అదే తరహా వాతావరణం కనిపిస్తుంటుంది. పాకిస్తాన్‌పై భారత్ మ్యాచ్ గెలిచిన తరువాత చోటు చేసుకునే సంబరాలకు అంతు ఉండదు. ఆకాశామే హద్దుగా అభిమానులు పండగ చేసుకుంటారు.

ఓడినా ఇబ్బందే..

ఓడినా ఇబ్బందే..

జాతీయ పతాకాలను చేతపట్టుకుని సందడి చేయడం సర్వ సాధారణం. బైక్‌లు, కార్లతో ర్యాలీలను నిర్వహిస్తూ విజయోత్సవాలను జరుపుకొంటుంటారు. టీమిండియా ఓడిపోయినా అదే తరహాలో విమర్శలు గుప్పించడం కూడా అంతే సహజం. ట్రోల్స్ మీద ట్రోల్స్ వచ్చి పడుతుంటాయి. పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోతే- అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందనేది రెండు నెలల కిందట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌లో స్పష్టమైంది కూడా.

ఆసియా కప్ 2023కి పాక్ ఆతిథ్యం..

ఆసియా కప్ 2023కి పాక్ ఆతిథ్యం..

ఇలాంటి పరిస్థితుల మధ్య- వచ్చే ఏడాది ఆసియా కప్‌ను పాకిస్తాన్ నిర్వహించబోతోండటం ఆసక్తి రేపుతోంది. ఆసియా కప్ 2023కి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది మన పొరుగుదేశం. ఈ టోర్నమెంట్‌లో ఆడాలంటే భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ విమానం ఎక్కక తప్పదు. అక్కడికి వెళ్లకూడదనుకుంటే టోర్నమెంట్ నుంచి వైదొలగడమా లేదా తటస్థ వేదికపై దీన్ని షిఫ్ట్ చేయడమా అనేది తేల్చుకోవాల్సి ఉంటుంది.

పాక్‌కు వెళ్లదలచుకోలేదు..

పాక్‌కు వెళ్లదలచుకోలేదు..

ఆసియా కప్ 2023లో ఆడటానికి పాకిస్తాన్‌కు వెళ్లదలచుకోలేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా కొద్దిసేపటి కిందటే నిర్ధారించారు. జై షా- ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఛైర్మన్ కూడా. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఈ టోర్నమెంట్‌ను తటస్థ వేదిక మీద నిర్వహించదలిస్తే తప్ప తాము పాల్గొనబోమని పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి షిఫ్ట్ చేయాలని పీసీబీకి లేఖ రాయనున్నట్లు ఆయన చెప్పారు.

తటస్థ వేదిక..

తటస్థ వేదిక..

ఈ ఏడాది శ్రీలంక ఈ టోర్నీని నిర్వహించాల్సి ఉన్నప్పటికీ- అక్కడ నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తరలించిన విషయాన్ని గుర్తుచేశారు. అదే తరహాలో ఏదైనా తటస్థ వేదిక మీద ఆసియా కప్ 2023ని ఏర్పాటు చేస్తే- తాము పాల్గొంటామని జై షా వ్యాఖ్యానించారు.

Story first published: Tuesday, October 18, 2022, 15:01 [IST]
Other articles published on Oct 18, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+