ప్రపంచకప్‌లో పంత్‌ను మిస్సవుతున్న టీమిండియా

భారత మాజీ కెప్టెన్, ఢిల్లీ మెంటార్ సౌరవ్ గుంగూలీ మరోసారి టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ విషయంను తెరపైకి తెచ్చాడు. ప్రపంచకప్‌లో టీమిండియా పంత్‌ను మిసవుతుందంటూ వ్యాఖ్యలు చేసాడు. ప్రపంచకప్ జట్టులో రిషబ్ పంత్‌కు చోటు దక్కలేదు. పంత్ స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ చోటు దక్కించుకున్నాడు.

ఫ్యూచర్ వికెట్ కీపర్:
గతంలో మాట్లాడుతూ.. 'ఎంఎస్ ధోనీ ఎప్పటికీ ఆడలేదు. దినేష్ కార్తీక్ కూడా ఎప్పటికీ ఆడలేదు. రిషబ్ పంత్ మాత్రమే ఆడగలడు.. అతనే టీమిండియా ఫ్యూచర్ వికెట్ కీపర్. పంత్ ఇంకా 15-16 ఏళ్ళు క్రికెట్ ఆడగలడు. ఈ ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడం పెద్ద సమస్యే కాదు. ఇది అతనికి ముగింపు కాదు. రాబోయే రోజులలో చాలా ప్రపంచకప్‌లు ఆడతాడు' అని గుంగూలీ అన్నారు.

రెండు రోజులు బాధపడ్డాడు:
'నేను సెలెక్టర్ అయితే.. రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా ఎంచుకునేవాడిని. దినేష్ కార్తిక్ కూడా మంచి ఆటగాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా జట్టు బాగుంది. జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో పంత్ రెండు రోజులు బాధపడ్డాడు. అనంతరం కోలుకున్నాడు' అని గుంగూలీ చెప్పుకొచ్చారు.

పంత్‌ను మిసవుతుంది:
ప్రపంచకప్ జట్టు ప్రకటించిన నాటి నుండి పంత్‌కు దాదా అండగా నిలుస్తున్నాడు. పంత్ విషయమై ఇదివరకే తన అబిప్రాయాన్ని తెలిపిన గుంగూలీ.. తాజాగా కూడా మరోసారి గళాన్ని విప్పాడు. సోమవారం గుంగూలీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'ప్రపంచకప్‌లో టీమిండియా పంత్‌ను మిసవుతుంది. అయితే అది ఎవరి స్థానంలో మిస్ అవుతుండో మాత్రం నాకు తెలియదు' అని పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications