ఛాంపియన్స్ ట్రోఫీ: 'పాక్‌ను భారత్ ఓడిస్తుంది', జయాపజయాల రికార్డు ఇదీ
హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను టీమిండియా ఓడిస్తుందని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. జూన్ 1 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుని సోమవారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గంగూలీ మీడియాతో మాట్లాడాడు. 'గత 8 నుంచి పదేళ్ల కాలంలో నాణ్యత పరంగా భారత్, పాక్ మధ్య చాలా వ్యత్యాసం వచ్చింది. అందుకే టీమిండియా పాక్‌పై ఆధిపత్యం చలాయిస్తోంది' అని గంగూలీ అన్నాడు.
'ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బర్మింగ్‌హామ్‌లో జూన్ 4న పాకిస్థాన్‌పై భారత మళ్లీ ఇదే చేస్తుందని నేను నమ్ముతున్నాను. వరల్డ్ కప్‌లో భారత్ ఎప్పుడూ పాకిస్థాన్ చేతిలో ఓడిపోలేదు. టీ20, వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో మన జయాపజయాల రికార్డు 11-0గా ఉంది' అని గంగూలీ అన్నాడు.

2005 తర్వాత పాక్‌లో పరిస్థితి మారింది
'ఇక ఛాంపియన్స్ ట్రోఫీని కలుపుకుంటే 12-2. పాక్‌లో 1990, 2000 కాలంలో వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, ఇంజమామ్ ఉల్ హక్, సయీద్ అన్వర్, జావెద్ మియాందాద్, సలీమ్ మాలిక్ వంటి హేమాహేమీలు ఉండేవారన్నాడు. అయితే 2005 తర్వాత పాక్‌లో పరిస్థితి మారింది. ప్రస్తుతం అక్కడ నాణ్యమైన క్రికెటర్లు లేరు' అని గంగూలీ అన్నాడు.

పాక్ క్రికెటర్ల టెక్నిక్ సైతం అంత బాగాలేదు
ప్రస్తుతం ఆ దేశ క్రికెటర్ల టెక్నిక్ సైతం అంత బాగాలేదని చెప్పాడు. ప్రస్తుతం క్రికెటర్లకు ఒత్తిడిని ఎలా జయించాలో కూడా తెలియదని గంగూలీ చెప్పుకొచ్చాడు. అయితే ఒత్తిడిలో ఉన్నప్పుడు టీమిండియా ఆటగాళ్లు రాణిస్తున్న తీరు అమోఘమని గంగూలీ ప్రశంసించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌ను భారత్ ఓడిస్తుంది
అందుకే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌ను ఓడించి తీరుతుందని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ నేతృత్వంలో టీమిండియా అద్భుత విజయాలను సైతం కైవసం చేసుకోవడం జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని గంగూలీ పేర్కొన్నాడు.

జూన్ 4వ తేదీన పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా జూన్ 4వ తేదీన పాకిస్థాన్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక గ్రూప్ స్టేజిలో కోహ్లీ సేన దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్టుతో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications