ట్రిపుల్ సెంచరీ చేసిన అవకాశాలు రాకపోవడంపై నాయర్
హైదరాబాద్: ట్రిపుల్ సెంచరీ వీరుడు కరుణ్ నాయర్‌ను దురదృష్టం వెంటాడుతోందా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇంగ్లాండ్‌తో చెన్నైలో జరిగిన నాలుగో టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించి, భారత్ తరుపున ఆ ఘనతను సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
దీంతో భారత్ జట్టులో నాయర్‌కు చోటు దక్కుతుందని అందరూ భావించారు. అలా ఎంత మాత్రం దక్కలేదు. టెస్టు సిరిస్ అనంతరం ఇంగ్లాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరిస్‌కు సెలక్టర్లు నాయర్‌ను ఎంపిక చేయలేదు. ఇక ఈ నెలలో బంగ్లాతో జరగనున్న ఏకైక టెస్టు కోసం ప్రకటించిన భారత జట్టులో నాయర్ చోటు దక్కించుకున్నాడు.

తుది జట్టులో ఉంటాడా? లేదా?
అయితే ఈ నెల 9 నుంచి 13వరకు హైదరాబాద్‌లో జరిగే ఏకైక టెస్టులో ఆడనున్న తుది జట్టులో ఉంటాడా? లేదా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇంగ్లాండ్ సిరిస్‌లో రహానే స్ధానంలో జట్టులోకి వచ్చి ట్రిపుల్ సెంచరీ సాధించిన జట్టులో నాయర్ స్థానంపై పూర్తిస్థాయి భరోసా లేకుండా పోయింది.

అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకుంటా
ట్రిపుల్ సెంచరీతో అరుదైన రికార్డుని నెలకొల్పినా సరైన అవకాశాలు రాకపోవడానికి కారణాలు ఏంటన్న ప్రశ్నకు నాయర్ తనదైన శైలిలో స్పందించాడు. 'జట్టులో స్థానం గురించి ఆలోచించి ఆందోళన చెందడం అనవసరం. నాకు ఎప్పుడైతై అవకాశం వస్తుందో అప్పుడే నన్ను నిరూపించుకుంటా' అని అన్నాడు.

క్రికెట్ అనేది గేమ్, ఎంజాయ్ చేయాలి
'క్రికెట్ అనేది గేమ్, దానిని ఎంజాయ్ చేయాలి. ఎల్లప్పుడూ పెద్ద స్కోర్లు సాధించడం కష్టమే. ప్రస్తుతం నా ఆటపరంగా ఎటువంటి ఇబ్బందీలేదు. వచ్చే సిరీస్‌ల్లో తుది జట్టులో ఉంటానా? లేదా? అనే దానిపై ఆలోచించడం లేదు. క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చు' అని నాయర్ తెలిపాడు.

బంగ్లాపై టీమిండియా విజయం సాధిస్తుంది
'వచ్చే గురువారం బంగ్లాతో హైదరాబాద్‌లో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌ను టీమిండియా గెలుచుకుంటుందని నాయర్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీమిండియా నెంబర్ వన్ జట్టు అని చెప్పిన నాయర్, యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పాడు. కాగా, ఇంగ్లాండ్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించిన తర్వాత రంజీ ట్రోఫీ సెమీ పైనల్స్‌తో పాటు ఇరానీ ట్రోఫీలో కరుణ్ నాయర్ ఆడిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications