మొదలైన విశాఖ వన్డే టికెట్ల అమ్మకం: 22న జట్లు నగరానికి రాక


హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య అక్టోబర్ 24న విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో వన్డేకి సంబంధించి టికెట్లు అమ్మకాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం (అక్టోబర్ 15)న ఉదయం 9 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
ఆన్‌లైన్‌తోపాటు టికెట్ల అమ్మకాలకు విశాఖ నగరంలో పది కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో టికెట్లను దక్కించుకునేందుకు గాను క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున టికెట్ కౌంటర్ల వద్ద బారులు తీరారు. టికెట్ల ధరలు రూ.500, రూ.1200, రూ.1800, రూ.2000, రూ.2500, రూ.3500, రూ.4000గా నిర్ణయించారు.

బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం 90 శాతం టికెట్లను
బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం 90 శాతం టికెట్లను ప్రేక్షకులకు విక్రయించనున్నారు. దీంతో సుమారు 27,500 టికెట్లను ప్రేక్షకులకు విక్రయించనున్నారు. ఈసారి టికెట్ రేట్లను కూడా భారీగా తగ్గించారు. గతంలో రూ. 6000కు విక్రయించిన టికెట్‌ను రూ. 4000కు, రూ.3,500 టికెట్‌ను రూ.2500, రూ.2500 టికెట్‌ను రూ.2000కు విక్రయిస్తున్నారు.

22న విశాఖకు చేరుకోనున్న ఇరు జట్ల ఆటగాళ్లు
ఇరు జట్ల ఆటగాళ్లు ఆక్టోబర్ 22న విశాఖకు చేరుకోనున్నారు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం అవుతుంది. వాస్తవానికి ఈ వన్డే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా జరగాల్సి ఉంది. బీసీసీఐతో కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం రావడంతో మ్యాచ్‌ను నిర్వహించలేమని ఎంపీసీఏ తేల్చిచెప్పడంతో మ్యాచ్‌ని విశాఖకు తరలించారు.

10 శాతం మాత్రమే కాంప్లిమెంటరీ పాసులుగా
దీంతో రెండో వన్డేకి విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం స్టేడియంలో 90 శాతం టికెట్లను అమ్మకానికి పెట్టాలి. 10 శాతాన్ని కాంప్లిమెంటరీ పాసులుగా ఇచ్చుకునే అవకాశం ఆయా రాష్ట్ర సంఘాలకు ఉంటుంది. అయితే, అంతకుమించి కావాలని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) డిమాండ్ చేసింది.
ఇండోర్ వన్డేని విశాఖకు తరలించిన బీసీసీఐ
ఇందుకు అంగీకరించని బోర్డు... రెండో వన్డేని విశాఖకు తరలించింది. దీంతో రెండో వన్డే ఆతిథ్యం కట్టబెడితే నిర్వహించేందుకు సిద్ధమా? అని బోర్డుతో పాటు సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) సంఘాన్ని కోరగా అందుకు సంసిద్ధత తెలిపింది. ఈ నేపథ్యంలో రెండో వన్డేని ఇండోర్ నుంచి విశాఖకు తరలిస్తున్నట్లు బీసీసీఐ తన ట్విట్టర్‌లో పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications