
బీసీసీఐ ముందు రెండు ఆప్షన్‌లు
ఫిబ్రవరిలో భారత్ వేదికగా జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల విషయంలో బీసీసీఐ ముందు రెండు ఆప్షన్‌లు ఉన్నాయని సమాచారం. అందులో మొదటిది ఆరు మ్యాచ్‌లను ఆరు వేదికల్లో నిర్వహించకుండా, ఒకటి లేదా రెండింటికే పరిమితం చేయడం. తద్వారా కరోనా ప్రమాదం ఉండదని బోర్డు అధికారులు భావిస్తున్నారు. తద్వారా బయోబబుల్ వంటి ఏర్పాట్లు కూడా సులభంగా ఉంటాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఆ వేదికలు ఏవనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సిరీస్ రద్దు
ఫిబ్రవరిలో కరోనా మూడో వేవ్ తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా లక్షల్లో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే అంతటా లాక్‌డౌన్‌లు తప్పవు. ఇదే జరిగితే రిస్క్ తీసుకునే ఆలోచనలో బీసీసీఐ లేదట. అందుకే ఆటగాళ్ల ఆరోగ్యరీత్యా సిరీస్‌ను రద్దు చేయాలని ఆలోచిస్తోందట. కరోనా కేసులు తగ్గాక మళ్లీ అప్పుడు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.

ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు
పై రెండు కాకుండా బీసీసీఐ మరో ఆలోచన కూడా చేస్తోందని సమాచారం. ఫిబ్రవరిలో మూడో వేవ్ ప్రారంభమై కరోనా కేసులు పెరిగినప్పటికీ ఆటగాళ్లకు ప్రమాదం లేదని భావిస్తే ప్రేక్షకులు లేకుండా సిరీస్‌ను నిర్వహించాలని భావిస్తోందని తెలిసింది. గత కరోనా సమయంలోనూ బీసీసీఐ ఇదే విధంగా పలు మ్యాచ్‌లు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే జాతీయ టోర్నీలు రద్దు
రంజీలో ఆటగాళ్లకు కరోనా సోకడంతో బీసీసీఐ ఇప్పటికే స్థానిక టోర్నీలను, జాతీయ టోర్నీలను రద్దు చేసింది. వీటన్నింటిని మళ్లీ ఎప్పుడూ నిర్వహించేది చెప్పలేదు. రద్దైన వాటిలో ఈ నెల 13 నుంచి జరగాల్సిన రంజీ ట్రోఫీ, వచ్చే నెలలో జరగాల్సిన కల్నల్ సికె. నాయుడు ట్రోఫీ, సీనియర్ మహిళల T20 లీగ్ ఉన్నాయి.

షెడ్యూల్ ఇదే
ఇప్పటికే బీసీసీఐ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు ఇరు జట్లు వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 6, 9, 12న వన్డే మ్యాచ్‌లు, 15, 18, 20న టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.


Click it and Unblock the Notifications












