2nd T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

కేరళ: తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ ఆదివారం వెస్టిండీస్‌తో తలపడనుంది. మొదటి టీ20లో ఇరు జట్లు విజయం కోసం హోరాహోరిగా పోరడాయి. కాని చివరికి విజయం టీమిండియానే వరించింది. ఈ రోజు(ఆదివారం) జరగనున్న రెండో టీ20లో విజయం సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
తమ టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన టీమిండియా సిరీస్ విజయంపై కన్నేసింది. మరోవైపు భారత్ జోరుకు అడ్డుకట్ట వేసి సిరీస్‌లో నిలవాలని చూస్తోంది.ఇటు వెస్టండీస్ కూడా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను డ్రా చేసుకోవాలనే కసితో ఉంది. వెస్టిండీస్ బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తున్నప్పటీకి బౌలింగ్ లో మాత్రం బలహీనంగా కనిపిస్తోంది.
ఇప్పటి వరకు గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరిగిన రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ స్పిన్నర్ల హవా కొనసాగింది. ఇప్పుడు కూడా వికెట్ నుంచి స్పిన్నర్లకు సహకారం లభించొచ్చు. ఆదివారం చిరుజల్లులు కురిసే అవకాశముంది. ఈ మైదానంలో విండీస్ గతంలో వన్డే ఆడింది. 2018లో జరిగిన ఈ వన్డేలో విండీస్ 104 పరుగులకే ఆలౌటైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications