జడేనా నా బలహీనతను కనిపెట్టాడు: కెప్టెన్సీపై కుక్
హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్ చేతిలో 4-0తో ఓటమి పాలవ్వడంపై ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఒకింత నిర్వేదంగా స్పందించాడు. చెన్నైలో జరిగిన చివరి టెస్టులో కోహ్లీ సేన ఇంగ్లాండ్‌పై 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 4-0 భారత్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్‌పై గతంలో లేనటువంటి అతిపెద్ద విజయాన్ని టీమిండియా నమోదు చేసిన సంగతి తెలిసిందే. టెస్టు సిరిస్ ఓటమి నేపథ్యంలో కెప్టెన్సీపై ఎలాంటి అనాలోచిత నిర్ణయాలూ తీసుకోనని అలెస్టర్ కుక్ అన్నాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్‌గా తాను కొనసాగేది లేనిది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాడు.

ఐదు టెస్టుల సిరీస్‌ను 4-0తో భారత్ కైవసం
చెన్నైలో జరిగిన చివరి టెస్టులో ఇంగ్లండ్ భారత్ చేతిలో ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో ఐదు టెస్టుల సిరీస్‌ను 4-0తో భారత్ కైవసం చేసుకుంది. 1999 తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలను భారత్ కైవసం చేసుకుంది. టెస్టుల్లో భారత్‌కు ఇది వరుసగా 18 విజయం కావడం విశేషం

కెప్టెన్సీపై ఇది సరైన సమయం కాదు
‘నేను స్వదేశం తిరిగి వెళ్లి దీనిపై కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ముందు నేను ఇంటికి తిరిగి వెళ్లి క్రిస్మస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తాను. ఆ తర్వాత జనవరిలో తిరిగి వచ్చి ఇంగ్లండ్ క్రికెట్‌కు ఏది మంచిదో స్ట్రాస్‌తో కలిసి ఆలోచిస్తాను' అని మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కుక్ చెప్పారు.

శక్తి తక్కువగా ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు
ఇంగ్లాండ్ జట్టును ముందుకు తీసుకెళ్లడానికి నేను సరైనవాడినో కాదో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ఎందుకంటే శక్తి తక్కువగా ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని కుక్ చెప్పాడు.

తమ బౌలర్లకన్నా భారత బౌలర్లు మెరుగ్గా రాణించారు
దాదాపు 7 నెలల పాటు టెస్టు మ్యాచ్ ఏదీ లేదని, అందువల్ల ఇప్పుడే, ఇక్కడికిక్కడే నిర్ణయం తీసుకోవడం తెలివితక్కువ అవుతుందని కూడా అలెస్టర్ కుక్ చెప్పాడు. కాగా, తమ బౌలర్లకన్నా భారత బౌలర్లు అశ్విన్, జడేజా ఎంతో బాగా బౌలింగ్ చేశారని కుక్ మెచ్చుకున్నాడు.

జడేజా తనలోని బలహీనతను కనిపెట్టి అవుట్ చేశాడు
అయితే ఈ సిరీస్‌లో అంతా నిరాశాజనకం కాదని, కొన్ని మంచి క్షణాలు కూడా ఉన్నాయని అంటూ, ఆటగాళ్లంతా ఒక జట్టుగా కలిసికట్టుగా ఆడామని, అయితే భారత్‌పై దీర్ఘకాలం ఒత్తిడి తేవడంలో విఫలమయ్యామని కుక్ చెప్పాడు. తాను స్పిన్‌ను సమర్ధంగా ఎదుర్కొంటానని.. కానీ జడేజా తనలోని బలహీనతను కనిపెట్టి కట్టడి చేశాడని కుక్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications