ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేసిన ధావన్
ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ప్లేయర్లు తెగ సంబరాలు చేసుకున్నారు. డ్రెస్సింగ్ రూంలో చిందులేశారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన నార్వే గ్రూప్ డ్యాన్స్‌ను అనుకరిస్తూ.. ప్లేయర్లందరు కదం తొక్కారు. బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ 'కాలా చష్మా'కు అదిరిపోయే స్టెప్పులేస్తూ సిరీస్ విజయాన్ని ఆస్వాదించారు. భారత సంబరాల వీడియోను వైస్-కెప్టెన్ శిఖర్ ధావన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. 'మేము మా విజయాన్ని ఇలా జరుపుకున్నాం' అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

రాహుల్ సారథ్యంలో తొలి సిరీస్ విజయం
ఇకపోతే కేఎల్ రాహుల్ సారథ్యంలో భారత్ మొట్టమొదటి సారి ఓ సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. గత కొంత కాలంగా గాయం, ఫిట్ నెస్ తదితర కారణాల వల్ల దూరమైన రాహుల్ ఈ సిరీస్ ద్వారా తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్‌కు ముందు బీసీసీఐ వైద్య బృందం అతను ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించడంతో అతని ఎంపిక లాంఛనమైంది. ఇక తొలుత ధావన్‌ను కెప్టెన్‌గా ప్రకటించిన టీం మేనేజ్ మెంట్ తర్వాత జట్టు పగ్గాలు కేఎల్ రాహుల్‌కు అప్పజెప్పింది. ఆసియా కప్‌కు ముందు కొంత బ్యాటింగ్ ప్రాక్టీస్, అలాగే మ్యాచ్ తర్ఫీదు పొందడానికి కేఎల్ రాహుల్‌ను ఈ సిరీస్ ఆడనిచ్చారు. ఇక బ్యాటింగ్లో వచ్చిన రెండు అవకాశాలను అతను అంత పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు.

ఇక అందరి కళ్లు ఆ మ్యాచ్‌పైనే
జింబాబ్వేతో వన్డే సిరీస్ ముగియడంతో ఇక అందరి కళ్లన్నీ ఆసియా కప్ మీదే ఉన్నాయి. ఆగస్టు 27న ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో భారత సీనియర్ టీం బరిలోకి దిగబోతుంది. ఆసియా కప్‌లో పాల్గొనే 15మంది సభ్యులతో కూడిన జట్టులో కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం జింబాబ్వే సిరీస్లో ఆడిన జట్టులోని దీపక్ హుడా, అవేశ్ ఖాన్‌లు కూడా ఆసియా కప్ జట్టులో ఉన్నారు. ఇక మోస్ట్ ఎవైటెడ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ ఆగస్టు 28న జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications












