Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: అందుకే ఖలీల్‌పై వేటు.. అతను అరంగేట్రం- శుభ్‌మన్ గిల్

జింబాబ్వే పర్యటనలో భారత్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. హరారే వేదికగా ఇవాళ రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్‌లోని పరాభవాన్ని మరిచి పుంజుకుని గొప్పగా సత్తాచాటాలని శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు కసిగా బరిలోకి దిగుతోంది. నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

మరోవైపు తొలి టీ20లో గెలిచిన జింబాబ్వే ఇవాళ పోరులోనే అదే జోరు కొనసాగించాలని, అయిదు టీ20ల సిరీస్‌లో తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. తొలి టీ20 జరిగిన వేదికగానే రెండో మ్యాచ్ జరగనుంది. కాగా, టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇవాళ మ్యాచ్‌లో భారత్ తరఫున సాయి సుదర్శన్ అరంగేట్రం చేయనున్నాడు. ఖలీల్ అహ్మద్ స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్‌ను సుదర్శన్ వస్తున్నాడు.

India vs Zimbabwe Need to improve our batting Sudharsan comes in for Khaleel- Shubman Gill

బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకోవాలని భావిస్తూ ఖలీల్‌ను తప్పించి సాయి సుదర్శన్‌కు అవకాశం ఇస్తున్నామని గిల్ పేర్కొన్నాడు. ''తొలుత బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. నిన్నటి మ్యాచ్ వికెట్‌ ఇదీ. బ్యాటింగ్ చేయడమే మంచి అవకాశంగా భావిస్తున్నాం. పిచ్ పొడిగా ఉంది. ఎండ ఎక్కువగా ఉంది. అయితే బ్యాటింగ్ మెరుగుపర్చుకోవాలని ఉద్దేశంతో ఖలీల్ అహ్మద్ స్థానంలో సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకువచ్చాం'' అని శుభ్‌మన్ గిల్ అన్నాడు.

తుది జట్లు:
భారత్: శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్.

జింబాబ్వే: వెస్స్‌లీ మధెవెరె, ఇన్నోసెంట్ కయా, బ్రియన్ బెన్నెట్, సికిందర్ రాజా(కెప్టెన్), డియాన్ మేయర్స్, జోహ్‌నాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదండే, వెల్లింగ్టన్ మసకడ్జా, లూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజర్బానీ, తెండాయ్ ఛత్రా

Story first published: Sunday, July 7, 2024, 16:16 [IST]
Other articles published on Jul 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+