
జింబాబ్వేపై ఇప్పటికే 2- 0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా మూడో వన్డేపై కన్నేసింది. మూడు వన్డేలు వరుసగా గెలిచి సిరీస్ వైట్ వాష్ చేసుకోవాలని చూస్తుంది. రెండు మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇక భారత్ మూడో వన్డేలో కూడా గెలవడం పెద్ద విషయమేమీ కాదు. నేడు జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత జట్టులో ప్రధానంగా పలు మార్పులు జరిగే అవకాశాలుంటాయని, కొత్త వాళ్లకు అవకాశాలొస్తాయని అంతా భావించారు. అయితే కెప్టెన్ కేఎల్ రాహుల్, ప్రధాన కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం అంత పెద్ద సాహసం చేయలేదు. కేవలం బౌలింగ్ యూనిట్లో రొటేషన్ పాలసీని మాత్రమే కొనసాగించారు. రాహుల్ త్రిపాఠి, షాబాజ్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్‌లను మళ్లీ బెంచ్ మీదనే నిలబెట్టేశారు. వీరికి సిరీస్ గెలిచినా కూడా జట్టులో చోటు దక్కక ఒకింత అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఇక తుది జట్టులో రెండు మార్పులే జరిగాయి. సిరాజ్, ప్రసీద్‌లను తప్పించి.. దీపక్ చాహర్, అవేశ్ ఖాన్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు.
ఇక టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత రెండు మ్యాచుల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాహుల్ ఈసారి మాత్రం బ్యాటింగ్ ఎంచుకుని కాస్త మంచి పని చేశాడు. భారత బ్యాటింగ్‌ను పూర్తిస్థాయిలో చూడ్డానికి వీలవుతుంది. టాస్ అనంతరం మాట్లాడుతూ.. మేం ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడానికి కారణం మమ్మల్ని మేం సవాల్ చేసుకోవడానికి మాత్రమే. మేం గత మ్యాచుల్లో బౌలింగ్ చేశాం కాబట్టి ఈ మ్యాచులో ఇలా ప్లాన్ చేస్తున్నాం. నేను మిడిలార్డర్లో కాసేపు బాగా ఆడ్డానికి ప్రయత్నిస్తా.' అని రాహుల్ చెప్పాడు.
తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్
జింబాబ్వే (ప్లేయింగ్ XI) : తకుద్జ్వానాషే కైటానో, ఇన్నోసెంట్ కైయా, టోనీ మున్యోంగా, రెగిస్ చకబ్వా (వికెట్ కీపర్, కెప్టెన్), సికందర్ రజా, సీన్ విలియమ్స్, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యాయుచి, రిచర్డ్ నగరవ