India vs Zimbabwe : జింబాబ్వే బౌలర్ల తుక్కురేగ్గొట్టిన ధావన్, గిల్.. తొలి వన్డేలో ఘన విజయం

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ విజయం సాధించింది. తొలుత జింబాబ్వే 40.3 ఓవర్లకు 189పరుగులకే ఆలౌట్ కాగా.. తర్వాత ఛేదనకు దిగిన భారత ఓపెనర్లు శిఖర్ ధావన్ (81పరుగులు 113బంతుల్లో 9ఫోర్లు నాటౌట్), శుభ్ మన్ గిల్ (82పరుగులు 72బంతుల్లో 10ఫోర్లు 1సిక్సర్ నాటౌట్).. హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో 190పరుగుల లక్ష్యాన్ని భారత్ 30.5ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా 10వికెట్ల భారీ తేడాతో గెలుపొందింది.
జింబాబ్వే బౌలర్లలో ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అంతకుముందు దీపక్ చాహర్, ప్రసీద్ క్రిష్ణ, అక్షర్ పటేల్ తలా 3 వికెట్లు తీసి జింబాబ్వేను వణికించారు. ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ చకబ్వా (35) కాస్త పర్వాలేదనిపించగా.. చివర్లో టెయిలండర్లు బ్రాడ్ ఈవన్స్ (33), ఎంగరవా (34) రాణించడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. దీపక్ చాహర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

తొలి స్పెల్‌లో వణికించిన దీపక్
ఇక ఛేదనకు దిగాక ధావన్ తొలి ఓవర్ తొలి రెండు బంతులను ఫోర్లు కొట్టి మంచి గేర్‌తో స్టార్ట్ చేసినట్లు అనిపించినా.. తర్వాత పూర్తి నిదానంగా ఆడాడు. మరో ఎండ్‌లో శుభ్ మన్ గిల్ సైతం తన టెస్టీ ఇన్నింగ్స్ ఆడడడంతో భారత్ 10 ఓవర్లకు 43 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత వీరిద్దరు కాస్త గేర్ మార్చారు. అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును ముందుకుతీసుకెళ్లారు.
ఈ క్రమంలో ధావన్ 76బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా పూర్తి చేశారు. తద్వారా వీరిద్దరు గత నాలుగు మ్యాచ్‌లలో మూడు సార్లు సెంచరీ కంటే ఎక్కువగా భాగస్వామ్యం నిలిపిన ఓపెనింగ్ జోడీగా నిలిచారు.

అత్యధిక వరుస విజయాల రికార్డు
ఇక 51 బంతులకే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శుభ్ మన్ గిల్.. తర్వాత మరింత విరుచుకుపడ్డాడు. దీంతో స్కోరు టార్గెట్ దిశగా సాగింది. వీరిద్దరి నిలకడకు, దూకుడుకు జింబాబ్వే బౌలర్ల వద్ద బదులు లేకపోయింది. ఎంగర్వా వేసిన 29వ ఓవర్లో గిల్ మూడు ఫోర్లు కొట్టి విన్నింగ్ చేరువ చేశాడు. ఇక ధావన్ ఫోర్ కొట్టి విన్నింగ్ షాట్‌తో విజయ లాంఛనాన్ని ముగించాడు.
తద్వారా 10వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఇండియా గెలుపొందింది. ఓ జట్టుపై ఇండియా అత్యధిక వరుస విజయాలు సాధించిన రికార్డును నెలకొల్పింది. 13* vs జింబాబ్వే (2013-22), 12 వర్సెస్ బంగ్లాదేశ్ (1988-04), 11 vs న్యూజిలాండ్ (1986-88), 10 vs జింబాబ్వే (2002-05).

తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్
జింబాబ్వే: మరుమణి, ఇన్నోసెంట్ కాయ, సీన్ విలియమ్స్, వెస్లీ మధేవెరే, సికందర్ రజా, చకాబ్వా (కెప్టెన్, వికెట్ కీపర్), ర్యాన్ బర్ల్, లూక్ జాంగ్‌వి, బ్రాడ్ ఇవాన్స్, విక్టర్ ఎన్‌యౌచి, రిచార్డ్ ఎంగర్వా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications