India vs Zimbabwe : టాపార్డర్ పిప్పిరాల్చిన దీపక్ చాహర్.. అయినా భారత్ మీద జింబాబ్వే రికార్డ్..!

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుని సత్తా చాటింది. ఇక సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన స్వింగ్ స్టార్ దీపక్ చాహర్.. తన ఆరంభ స్పెల్‌లో జింబాబ్వేను వణికించాడు. మిగతా బౌలర్లు కూడా సత్తా చాటడంతో జింబాబ్వే 40.3 ఓవర్లకు 189పరుగులకే ఆలౌటైంది. దీపక్ చాహర్, ప్రసీద్ క్రిష్ణ, అక్షర్ పటేల్ తలా 3 వికెట్లు తీసి జింబాబ్వే పిప్పి రాల్చారు. సిరాజ్ ఓ వికెట్ తీశాడు. దీంతో జింబాబ్వే బ్యాటింగ్లో బేజారైంది. ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ చకబ్వా (35) కాస్త పర్వాలేదనిపించగా.. చివర్లో టెయిలండర్లు బ్రాడ్ ఈవన్స్ (33), ఎంగరవా (34) కాస్త అనూహ్యంగా ఆడడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.

తొలి స్పెల్‌లో వణికించిన దీపక్
ఇక తొలి స్పెల్‌లో చాహర్, సిరాజ్ బౌలింగ్‌కు దిగి జింబాబ్వే ఓపెనర్లను ముప్పు తిప్పలు పెట్టారు. వీరి దెబ్బకు పరుగులు తీయడానికి ఓపెనర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇక చాహర్ బౌలింగ్లో ఇన్నోసెంట్ కాయ (4) కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. చాహల్ స్వింగ్ బంతులకు క్రీజులో నిలబడ్డాకి తిప్పలు పడ్డ మరుమని (8), మధేవెరా (5) కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సిరాజ్ సైతం విలియమ్స్ (1)ను స్లిప్‌లో దొరకబుచ్చుకున్నాడు. 13వ ఓవర్ల పాటు సాగిన వీరి తొలి స్పెల్లో జింబాబ్వే 4వికెట్లు కోల్పోయి 52పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇన్ ఫాం బ్యాటర్ల అంతు చూసిన ప్రసీద్
ఆ తర్వాత ఇన్ ఫాం బ్యాటర్ అయిన సికిందర్ రజా (12పరుగులు)ను ప్రసీద్ క్యాచ్ ఔట్ చేయడంతో జింబాబ్వేకు కోలుకోలేని దెబ్బ పడింది. మరో ఫామ్ ప్లేయర్ ర్యాన్ బర్ల్ (11) అంతు కూడా ప్రసీదే చూశాడు. ఇక ఆ తర్వాత అక్షర్ పటేల్ వకల్తా పుచ్చుకున్నాడు. కాస్తో కూస్తో పోరాడుతున్న చకబ్వా (35)ను బౌల్డ్ చేసిన అక్షర్ తర్వాత జోంగ్వే (1)ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపించాడు. ఈ క్రమంలో 110 పరుగులకే 8వికెట్లు కోల్పోయిన జింబాబ్వేను తొమ్మిదో వికెట్‌కు ఎంగర్వా, ఈవన్స్ ఆదుకున్నారు.

9వ వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం
వీరిద్దరు బౌండరీలు అడపాదడపా బాదుతూ భారత బౌలర్లపై కాసేపు ప్రతిఘటించారు. ఈ క్రమంలో ఏకంగా 9వ వికెట్‌కు 70పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇండియాపై అత్యుత్తమ 9వ వికెట్ భాగస్వామ్యాన్ని జింబాబ్వే నెలకొల్పింది. ఇక ఎంగర్వాను ప్రసీద్, చివరి వికెట్ న్యూయచి (8)ను అక్షర్ ఔట్ చేయడంతో జింబాబ్వే పోరాటం ముగిసింది. ఇక తర్వాత 190పరుగుల ఛేదన కోసం బ్యాటింగ్‌కు దిగిన ఇండియా కీలక మార్పు చూపెట్టింది. ఓపెనర్‌గా కెప్టెన్ కేఎల్ రాహుల్ రాకుండా.. శుభ్ మన్ గిల్‌ను పంపించాడు. ధావన్, గిల్ నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. 7ఓవర్లకు స్కోరు వికెట్ కోల్పోకుండా 30పరుగులకు చేరుకుంది.

తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్
జింబాబ్వే: మరుమణి, ఇన్నోసెంట్ కాయ, సీన్ విలియమ్స్, వెస్లీ మధేవెరే, సికందర్ రజా, చకాబ్వా (కెప్టెన్, వికెట్ కీపర్), ర్యాన్ బర్ల్, లూక్ జాంగ్‌వి, బ్రాడ్ ఇవాన్స్, విక్టర్ ఎన్‌యౌచి, రిచార్డ్ ఎంగర్వా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications