Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: జింబాబ్వే క్లీన్ స్వీప్.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో తొలి ట్రోఫీ కైవసం!

IND vs ZIM: జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. వరుసగా రెండు సిరీస్‌లలో ఓటమి పాలైన భారత క్రికెట్ జట్టు జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేసి ఎట్టకేలకు ఓ సిరీస్‌ను గెలుచుకుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో భారత జట్టు 35 పరుగుల తేడాతో విజయం సాధించి ఆతిథ్య జింబాబ్వేను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మొదట ఐర్లాండ్‌లో, ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో సిరీస్ ఓటములను చవిచూసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు.. తిరిగి తన పాత ఫామ్‌లోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. దానికి సమాధానంగా జింబాబ్వే జట్టు 7 వికెట్ల నష్టానికి కేవలం 157 పరుగులు మాత్రమే చేయగలిగింది.

IND vs ZIM: తొలి బంతికే వికెట్.. టీ20ల్లో ఆల్‌టైమ్ రికార్డు సమం!

IND vs ZIM: తొలి బంతికే వికెట్.. టీ20ల్లో ఆల్‌టైమ్ రికార్డు సమం!

192 పరుగులు చేసిన టీమిండియా
మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి.. వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ సహాయంతో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. భారత జట్టు తరఫున వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అభిషేక్ మరోసారి విఫలమై కేవలం 2 పరుగులు చేసి అవుటయ్యాడు. మూడో స్థానంలో వచ్చిన వైభవ్, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్లు రెండో వికెట్‌కు 50 బంతుల్లో 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోరును 95 పరుగులకు చేర్చారు. ఇషాన్ కిషన్ 26 బంతుల్లో 29 పరుగులు చేసి రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

India vs Zimbabwe 3rd T20 Team India Sweeps Series 3-0 Shreyas Iyer Wins First Trophy as Captain

అద్భుతం చేసిన వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. వైభవ్ సూర్యవంశీ తన తొలి టీ20 సెంచరీని చేరుకుంటాడని అనిపించిన తరుణంలో 81 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇది వైభవ్‌కు రెండో అంతర్జాతీయ అర్ధశతకం. 49 బంతుల్లో ఆడిన తన ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ నాలుగు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లు కొట్టాడు.

Commonwealth Games 2026: తృటిలో స్వర్ణం మిస్.. భారత్ ఖాతాలో రెండో పతకం!

Commonwealth Games 2026: తృటిలో స్వర్ణం మిస్.. భారత్ ఖాతాలో రెండో పతకం!

శ్రేయస్ అయ్యర్ మరోసారి తన మంచి ఆరంభాన్ని పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాడు. భారత కెప్టెన్ 18 బంతుల్లో 27 పరుగులు చేసి అవుటయ్యాడు. తిలక్ వర్మ 9 బంతుల్లో 11 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. రింకు సింగ్ 14 బంతుల్లో 25 పరుగులు చేసి భారత జట్టు స్కోరును 5 వికెట్ల నష్టానికి 192 పరుగులకు చేర్చాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి రింకూ సింగ్ అవుటయ్యాడు.జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి 1 వికెట్ తీయగా, బ్లెస్సింగ్ ముజరబాని 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 1 వికెట్, వెస్లీ మధెవెరే 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి 1 వికెట్, బ్రాడ్ ఎవాన్స్ 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు.

Story first published: Sunday, July 26, 2026, 20:35 [IST]
Other articles published on Jul 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+