Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాజ్‌కోట్‌లో ఎండవేడిమి: పుజారా జేబులో వాటర్ బాటిల్? (వీడియో)

India vs Windies: What is bulging in Cheteshwar Pujara’s pocket?

హైదరాబాద్: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా గురువారం తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది.

ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే లోకేష్ రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. గాబ్రియెల్ వేసిన ఆ ఓవర్‌ చివరి బంతికి రాహుల్ ఎల్బీడబ్య్లూగా వెనుదిరిగాడు. మొదట దీనిని అంపైర్ అవుట్ ఇవ్వగా, రాహుల్ రివ్యూ కోరాడు. అయితే, రిప్లేలో అది ఔట్ అని తేలడంతో భారత్ ఒక రివ్యూ కోల్పోయింది.

1
44264

రెగ్యూలర్ ఓపెనర్లు మురళీ విజయ్, ధావన్‌ను జట్టులోంచి తప్పించడంతో వారి స్థానంలో బరిలోకి దిగిన రాహుల్, పృథ్వీ షా జట్టుకు శుభారంభం ఇవ్వలేకపోయారు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి ఓపెనర్ పృథ్వీ షా చక్కటి సమన్వయంతో ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు.

 హాఫ్‌ సెంచరీ సాధించిన పృథ్వీ షా

హాఫ్‌ సెంచరీ సాధించిన పృథ్వీ షా

పృథ్వీ షా 55 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా భారత్‌ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ సాధించిన పిన్నవయస‍్కుడిగా పృథ్వీ షా అరుదైన చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత పుజారా కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. మొదట్లో నెమ్మదిగా ఆడి... ఆ తర్వాత వేగం పెంచిన పుజారా 67 బంతుల్లోనే తొమ్మిది బౌండరీలతో కెరీర్‌లో 19వ హాఫ్ సెంచరీ చేశాడు.

లంచ్ విరామానికి టీమిండియా 133/1

మరో ఓపెనర్ పృథ్వీ షాతో కలిసి వికెట్ పడకుండా పుజారా ఆచితూచి జాగ్రత్తగా ఆడుతున్నాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో లంచ్ విరామ సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 133 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీషా(75), పుజారా(56) పరుగులతో ఉన్నారు.

రాజ్‌కోట్‌లో విపరీతమైన ఎండవేడిమి

రాజ్‌కోట్‌లో విపరీతమైన ఎండవేడిమి

లంచ్ సమయానికి వీరిద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ఎండవేడిమి విపరీతంగా ఉంది. అయితే, ఈ ఎండవేడిమిని అధిగమించడానికి పుజారా వాటర్‌ బాటల్‌ను చెంతనే పెట్టుకున్నాడు. ఒక చిన్నసైజు వాటర్‌ బాటిల్‌ను జేబులో ఉంచుకున్నాడు.

బీసీసీఐ ట్విట్టర్‌లో వీడియో

దాహాం వేసినప్పుడు తన జేబులోనుంచి వాటర్ బాటిల్‌ తీసి అందులోని వాటర్ తాగుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియాని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Story first published: Thursday, October 4, 2018, 13:05 [IST]
Other articles published on Oct 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+