Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విండిస్‌కు ఎదురుదెబ్బ: రోచ్ కుటుంబంలో విషాదం, తొలి టెస్టుకు దూరం

India vs Windies: Kemar Roach ruled out of the first Test

హైదరాబాద్: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి టెస్టు అక్టోబర్ 4(గురువారం) నుంచి రాజ్ కోట్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే, ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందే వెస్టిండిస్‌కు ఊహించని షాక్ తగిలింది.

రాజ్‌కోట్ వేదికగా గురువారం ఆరంభంకానున్న తొలి టెస్టుకు ఆ జట్టు పేసర్ కీమర్ రోచ్ దూరం కానున్నాడు. కీమర్ రోచ్ కుటుంబంలో విషాదం నెలకొంది. రోచ్ నానమ్మ మృతి చెందడంతో అతడు భారత్ నుంచి నేరుగా బార్బడోస్‌లోని తన నివాసానికి వెళ్లాడు.

అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత అతడు తొలి టెస్టు మధ్యలో జట్టుతో కలవనున్నాడు. ఈ మేరకు వెస్టిండిస్ జట్టు కోచ్ స్టువర్ట్ లా ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప నైపుణ్యం కలిగిన ఫాస్ట్‌బౌల‌ర్‌ కీమర్ రోచ్‌కు మంచి అనుభవం ఉందని తెలిపాడు.

ఓ క్రికెట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కీమర్ రోచ్ మాట్లాడుతూ "కీమర్ రోచ్ కుటుంబంలో విషాదం నెలకొన్న నేపథ్యంలో అతడు బార్బడోస్‌కు వెళ్లాడు. టెస్టు మధ్యలో అతడు తిరిగి జట్టులో చేరతాడు. రెండో టెస్టుకి అతడు అందుబాటులో ఉంటాడు. మా జట్టు నాయకుల్లో అతడొకడు. జట్టుకు అతడు దూరమవడం పెద్ద లోటే" అని అన్నాడు.

ఇప్పటి వరకు వెస్టిండిస్ తరుపున 48 టెస్టులాడిన రోచ్ 163 వికెట్లు తీశాడు. ఆతిథ్య టీమిండియాతో నెలరోజుల సుధీర్ఘ సిరీస్ కోసం కొద్దిరోజుల ముందే భారత్‌కు వచ్చిన వెస్టిండిస్ జట్టు ఇటీవలే రెండు రోజుల వార్మప్ మ్యాచ్ కూడా ఆడిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, October 2, 2018, 18:18 [IST]
Other articles published on Oct 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+