

హైదరాబాద్: భారత్-విండీస్ మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ దున్నేసింది. తొలి టెస్టులో రెండున్నర రోజుల్లోనే ముగించిన టీమిండియా.. రెండో టెస్టును మూడు రోజుల్లో ముగించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కాస్త పోరాడిన విండీస్.. రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసింది. తొలిటెస్టులో పృథ్వీషా ఆరంగేట్ర శతకం, రెండో టెస్టులో రిషబ్ పంత్ విజృంభన ఆతిథ్య జట్టును భారీగా దెబ్బ కొట్టాయి.
తొలి టెస్టులో ఇన్నింగ్స్ 267 పరుగుల తేడాతో, రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2002-03 నుంచి సొంతగడ్డపై విండీస్‌తో ఆడిన మొత్తం 21 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా భారత్ ఓడలేదు. భారత్ ఘన విజయంపై సామాజిక మాధ్యమాల వేదికగా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
'సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియాకు శుభాకాంక్షలు. బాగా బౌలింగ్ చేశావ్ ఉమేశ్ యాదవ్. పృథ్వీషాకు ఇది అద్భుతమైన ఆరంభం. పంత్ ఈ సిరీస్‌లో మెరిశాడు. అతడి ఆటతీరు అద్భుతం'.
'స్వదేశీ గడ్డ మీద 10 వికెట్లు తీయడానికి ఉమేశ్‌యాదవ్ అద్భుతమైన శ్రద్ధ పెట్టాడు. శ్రీనాథ్, కపిల్ దేవ్ తర్వాత అంత వేగంగా వికెట్లు తీసిన ఘనత ఉమేశ్‌దే. స్వదేశంలో వరుసగా పదో సిరీస్ నెగ్గినందుకు కంగ్రాట్స్ టీమిండియా'.
'రెండు టెస్టు సిరీస్‌లలో 10 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్‌కు అభినందనలు. మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు శుభాకాంక్షలు. పృథ్వీ షా, పంత్ ఇద్దరూ ముందు ముందు ఇదే దూకుడు కనబర్చాలి'
'పృథ్వీ షా మెరుపులు మీరు చూశారా?. 10వికెట్ల తేడాతో విండీస్‌పై భారత్ గెలుపొందింది. కంగ్రాట్స్ టీమిండియా'.
'కంగ్రాట్స్ టీమిండియా, బీసీసీఐ. బౌలింగ్‌కు కొత్తదనాన్ని తీసుకొచ్చిన ఉమేశ్‌కు అభినందనలు. పృథ్వీ షా, రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు ముగ్ధుడినయ్యాను.
భారత్ ఓ అద్భుత ప్రదర్శన చేసి ఈ విజయాన్నందుకుంది. కొన్ని ప్రత్యేక ప్రదర్శనలు బాగా ఆకట్టుకున్నాయి.