Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

10 సెకన్లలో 3 పరుగులు: కేఎల్ రాహుల్ కొత్త ఛాలెంజ్ ఇదే(వీడియో)

India vs Windies 2018: KL Rahul Takes The '3 Runs In 10 Seconds' Challenge | Oneindia Telugu
India vs Windies 2018: KL Rahul Takes the 3 Runs in 10 Seconds Challenge

హైదరాబాద్: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా పర్యాటక వెస్టిండిస్ జట్టుతో అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో టెస్టులోనైనా రాణించేందుకు గాను ఓపెనర్ కేఎల్ రాహుల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కేఎల్ రాహుల్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

ఈ టెస్టులో వెస్టిండిస్ బౌలర్ గాబ్రియెల్ వేసిన తొలి ఓవర్‌ చివరి బంతికి రాహుల్ ఎల్బీడబ్య్లూగా వెనుదిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. మొదట దీనిని అంపైర్ అవుట్ ఇవ్వగా, రాహుల్ రివ్యూ కోరాడు. అయితే, రిప్లేలో అది ఔట్ అని తేలడంతో నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.

దీంతో రెండో టెస్ట్‌లోనైనా తిరిగి ఫామ్‌లోకి రావాలని పట్టుదలతో ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా జరుగనున్న రెండో టెస్ట్‌కు ముందు నెట్స్‌‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌తో పాటు ఫిట్‌నెస్ సైతం మెరుగు పరచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా కేఎల్ రాహుల్ 10 సెకన్లలో 3 పరుగులు అంటూ ఓ సరికొత్త ఛాలెంజ్‌ని స్వీకరించాడు.

ఈ ఛాలెంజ్‌లో భాగంగా కేఎల్ రాహుల్ కేవలం 10 సెకన్లలోనే మూడు పరుగులు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది.

Story first published: Tuesday, October 9, 2018, 19:38 [IST]
Other articles published on Oct 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+